ఘోర రోడ్డు ప్రమాదం.. టాప్‌ మోడల్‌, యాంకర్‌, నటి దుర్మరణం

Posted By:
Subscribe to Oneindia Telugu

కోల్‌కతా: టాప్‌ మోడల్‌, యాంకర్‌, నటి సోనికా చౌహాన్‌ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె స్నేహితుడు, బెంగాలీ యువ నటుడు బిక్రమ్‌ ఛటోపాధ్యాయతో కలిసి కారులో వెళుతుండగా శనివారం ఉదయం లాకేమాల్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ ను ఢీకొని అనంతరం పేవ్‌మెంట్‌ ఎక్కేసింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కారులో చిక్కుకుని, తీవ్రంగా గాయపడిన బిక్రమ్‌, సోనికాను హుటాహుటీన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Actor Vikram Injured, Model Sonika Dead In Major Accident

అయితే అప్పటికే సోనికా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. తలకు తీవ్రంగా గాయమైన బిక్రమ్‌ కు మాత్రం వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో వారు ప్రయాణించిన టయోటా కారు పూర్తిగా ధ్వంసం అయింది.

ప్రమాదం జరిగినప్పుడు బిక్రమ్‌ కారును అత్యంత వేగంగా నడుపుతున్నట్లు తెలిసింది. అలాగే ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఎయిర్‌ బ్యాగ్స్‌ కూడా సరిగా పని చేయలేదని అంటున్నారు.

Actor Vikram Injured, Model Sonika Dead In Major Accident

ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆధారాల కోసం ప్రమాదం జరిగిన ప్రదేశంలోని సీసీ టీవీ పుటేజ్‌ ను పరిశీలిస్తున్నారు. సోనికా చౌహాన్‌ మృతి పట్ల పలువురు బెంగాలీ నటులు సంతాపం తెలిపారు. బిక్రమ్‌ బెడ్రూమ్‌, మిస్టేక్‌, అమీ ఔర్‌ అమర్‌ గాళ్‌ఫ్రెండ్స్‌తో పాటు పలు బెంగాలీ చిత్రాల్లో హీరోగా నటించాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kolkata: Tollywood actor Vikram Chatterjee suffered injuries after he met with an accident at the Rashbehari. His co-passenger, also a model, Sonika Singh Chouhan died due to this accident. The accident occurred at about 4am. The locals rushed them to the hospital where model Sonika was declared brought dead. Actor Vikram Chatterjee was initially released after first aid. But later on he felt ill and once again got admitted. The incident occurred in front of Lake Mall near Rashbehari Avenue. As per the police, Vikram’s car lost control and got into the footpath. After this, it rammed into a shop and turned 180 degrees. Model Sonika instantly died at the spot. Actor Vikram in presently admitted at the Ruby General Hospital.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి