• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరీనాకు సోకిన కరోనా: అమృత అరోరాకు కూడా: కోవిడ్ ప్రొటోకాల్స్ బేఖాతర్..నైట్ పార్టీలు

|
Google Oneindia TeluguNews

ముంబై: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ క్రమంగా విజృంభిస్తోన్నట్టే కనిపిస్తోంది. ప్రాణాంతక కరోనా వైరస్‌కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్.. చాపకింద నీరులా విస్తరిస్తోంది. అనూహ్యంగా ఆ వేరియంట‌్‌కు సంబంధించిన పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటిదాకా నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 36కు చేరుకుంది. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌, ఢిల్లీ, ఏపీ, హర్యానాల్లో కేసులు రిజిస్టర్ అయ్యాయి. అత్యధిక పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో రికార్డయ్యాయి.

జగన్‌పై హత్యాయత్నం అనుమానాలు: కొడాలి నాని, వంశీ కుట్ర: ప్రశాంత్ కిషోర్ స్కెచ్‌: బుద్ధా వెంకన్నజగన్‌పై హత్యాయత్నం అనుమానాలు: కొడాలి నాని, వంశీ కుట్ర: ప్రశాంత్ కిషోర్ స్కెచ్‌: బుద్ధా వెంకన్న

ఇప్పటిదాకా 17 ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు అక్కడ వెలుగులోకి వచ్చాయి. ఈ పరిస్థితులను నివారించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం పలు కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటోంది. కోవిడ్ ప్రొటోకాల్స్‌ను కఠినంగా అమలు చేస్తోంది. ప్రత్యేకించి- ముంబై పరిధిలో ఒమిక్రాన్ గానీ, కరోనా వైరస్ కేసుల సంఖ్య గానీ పెరగకుండా పలు ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. అయినప్పటికీ- దానికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడట్లేదు.

Actors Kareena Kapoor and Amrita Arora tested positive for Covid19, violated norms

బాలీవుడ్ నటులు, సెలెబ్రిటీలు, హైప్రొఫైల్ లైఫ్‌ను అనుభవించే వారు కోవిడ్ ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘిస్తోన్నారు. నైట్ పార్టీలకు యథేచ్ఛగా వెళ్తోన్నారు. దీని ప్రభావం పడింది. ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్.. కరోనా వైరస్ బారిన పడ్డారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు డాక్టర్లు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. ఈ మహమ్మారి ఆమెకు సోకినట్లు తేలింది. కరీనా కపూర్‌తో పాటు అమృత అరోరాకు కూడా ఈ వైరస్ సోకింది.

దీనితో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. వారిద్దరితో కాంటాక్ట్ అయిన వారు తక్షణమే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని ఆదేశించారు. సెలబ్రేషన్లకు అటెండ్ అయినందున వారి నుంచి మరికొందరికి వైరస్ సోకి ఉండే ప్రమాదం లేకపోలేదని బీఎంసీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ప్రవదర్శించవద్దని సూచించారు.

ఇప్పటికే ధారవి సహా ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ఒమిక్రాన్ వేరియంట్ తిష్ట వేసినందున జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ మధ్యకాలంలో కరోనా వైరస్ బారిన పడిన ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలెబ్రిటీల జాబితాలో కరీనా కపూర్, అమృత అరోరా చేరారు. ఇదివరకు బహుభాషా నటుడు, మక్కల్ నీథి మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్‌కు ఈ వైరస్ సోకింది. దీనితో మూడువారాల పాటు ఆయన క్వారంటైన్‌లో గడిపారు. విశ్రాంతి తీసుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.

English summary
Actors Kareena Kapoor and Amrita Arora tested positive for Covid 19. Both of them had violated Coronavirus protocals and attended several parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X