Actress: సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు, కేసు పెట్టిన మాజీ ఎంపీ, ప్రముఖ హీరోయిన్ !

బెంగళూరు/న్యూఢిల్లీ: బహుబాషనటి, మాజీ ఎంపీ, స్యాండిల్ వుడ్ క్వీన్ రమ్యా మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటున్న నటి రమ్యా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది. అభిమానులు, ఫ్రెండ్స్ తో సోషల్ మీడియాలో టచ్ లో ఉంటున్న రమ్యా అప్పుడప్పుడు సినిమా ఫంక్షలకు హాజరౌతోంది. త్వరలో నటి రమ్యా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోందని జోరుగా ప్రచారం జరిగింది. ప్రముఖ హీరోతో కలిసి నటి రమ్యా హీరోయిన్ గా నటిస్తోందని జోరుగా ప్రచారం జరిగినా ఇంత వరకు అధికారికంగా క్లారిటీలేదు. అయితే నటి రమ్యాను సోషల్ మీడియాలో టార్చర్ పెడుతున్నారని కేసు నమోదు అయ్యింది. ఓ వ్యక్తి తనను ఇన్ స్టాగ్రామలో ఇబ్బంది పెడుతున్నాడని, అసభ్యంగా మెసేజ్ లు పెడుతున్నాడని స్వయంగా నటి రమ్యా కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

 కన్నడ, తెలుగు, తమిళ సినిమాల హీరోయిన్ రమ్యా

కన్నడ, తెలుగు, తమిళ సినిమాల హీరోయిన్ రమ్యా

స్యాండిల్ వుడ్ హీరోయిన్ గా పరిచయం అయిన రమ్యా కన్నడ సినిమా రంగంలో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన రమ్యా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ సొంతం చేసుకున్న నటి రమ్యా కొన్ని సంవత్సరాల పాటు స్యాండిల్ వుడ్ ను ఏలేసింది.

 సినిమాలకు దూరం అయిన స్యాండిల్ వుడ్ క్వీన్

సినిమాలకు దూరం అయిన స్యాండిల్ వుడ్ క్వీన్

స్యాండిల్ వుడ్ క్వీన్ గా పేరు సొంతం చేసుకున్న నటి రమ్యా తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రమ్యా కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పై ఎంపీగా విజయం సాధించింది. తరువాత కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రమ్యా ఆ పార్టీలో కీలకనేతగా ఎదిగింది.

 రాజకీయాలకు గుడ్ బై

రాజకీయాలకు గుడ్ బై

కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఆ పార్టీలో చరుకుగా ఉంటూ బీజేపీ మీద విమర్శలు చేసిన రమ్యా ఢిల్లీకి మకాం మార్చేసింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్ గా బాద్యతలు స్వీకరించిన రమ్యా తరువాత ప్రధాని మోదీ మీద, బీజేపీ నాయకుల మీద తీవ్ర విమర్శలు చేసింది. గత లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం, నరేంద్ర మోదీ ప్రధాని కావడంతో నటి రమ్యాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇదే సమయంలో సొంత పార్టీలో శత్రువులు ఎక్కువ కావడంతో నటి రమ్యా రాజకీయాలకు దూరం అయ్యింది.

 సోషల్ మీడియాలో టైమ్ పాస్

సోషల్ మీడియాలో టైమ్ పాస్

సినిమాలకు, రాజకీయాలకు దూరం అయిన రమ్యా ఎక్కువగా విదేశాల్లో కాలం గడిపింది. సినిమాలకు, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న నటి రమ్యా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది. అభిమానులు, ఫ్రెండ్స్ తో సోషల్ మీడియాలో టచ్ లో ఉంటున్న రమ్యా అప్పుడప్పుడు సినిమా ఫంక్షలకు హాజరౌతోంది.

 బెంగళూరులో కేసు పెట్టిన నటి రమ్యా

బెంగళూరులో కేసు పెట్టిన నటి రమ్యా

త్వరలో నటి రమ్యా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోందని జోరుగా ప్రచారం జరిగింది. ప్రముఖ హీరోతో కలిసి నటి రమ్యా హీరోయిన్ గా నటిస్తోందని జోరుగా ప్రచారం జరిగినా ఇంత వరకు అధికారికంగా క్లారిటీలేదు. అయితే నటి రమ్యాను సోషల్ మీడియాలో టార్చర్ పెడుతున్నారని కేసు నమోదు అయ్యింది.

 బెంగళూరు పోలీసులు ఎంట్రీ

బెంగళూరు పోలీసులు ఎంట్రీ

ఓ వ్యక్తి తనను ఇన్ స్టాగ్రామలో ఇబ్బంది పెడుతున్నాడని, అసభ్యంగా మెసేజ్ లు పెడుతున్నాడని స్వయంగా నటి రమ్యా బెంగళూరు కేంద్ర సీఇఎన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. నటి రమ్యాను టార్చర్ పెట్టింది ఎవరు ? అనే విషయాన్ని పోలీసులు బయటకు లాగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+