హోటల్లో రేప్ జరిగిందని సినీ తార ఆరోపణ: ఆమె తీరుపై విస్మయం
న్యూఢిల్లీ: తనపై అత్యాచారం జరిగిందని ఆరోపించిన సినీ నటి, మోడల్ గత మూడు రోజులుగా విచారణకు పోలీసులకు సహకరించడం లేదు. తనపై అత్యాచారం ముంబైకి చెందిన బాలీవుడ్ తార, మోడల్ ఫిర్యాదు చేసింది. అయితే, ఆమె దర్యాప్తునకు ఎందుకు సహకరించడం లేదనే విషయంపై పోలీసులు విస్మయం చెందుతున్నారు.
దక్షిణ ఢిల్లీలో గల హోటల్‌లో తనపై అత్యాచారం జరిగిందని, హోటల్ ఉద్యోగి ఒకతను తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదు చేసింది. అయితే, దర్యాప్తునకు మాత్రం సహకరించడం లేదు. వైద్య పరీక్షలు చేయించుకోకుండా ఆమె తప్పించుకుంటోంది. దానికి తోడు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించింది. ఆమె సహకరించకపోవడంపై ఎఫ్ఐఆర్‌ను పోలీసులు నమోదు చేయలేకపోతున్నారు.

తమకు సహకరించాలని పోలీసులు బుధవారంవరకు ఆమెకు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఈ నాటకం ఆదివారం ప్రారంభమైంది. హోటల్లో తాను శుక్రవారం నుంచి ఉంటున్నట్లు, హోటల్ హౌస్‌కీపింగ్ స్టాఫ్ తన విలువైన వస్తువులను ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫతేపురి బేరీ పోలీసులకు రాతపూర్వకమైన ఫిర్యాదు కూడా ఇచ్చింది.
ఈ నెల 13వ తేదీన ఆ నటి సుల్తాన్‌పురా మజ్రాలో గల హోటల్లో దిగినట్లు, కొద్ది గంటల తర్వాత ఆమె గ్రేటర్ కైలాస్‌లోని నైట్ క్లబ్బుకు వెళ్లినట్లు, రాత్రి పొద్దు పోయే వరకు మిత్రులతో విందులో పాల్గొన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
మార్చి 14వ తేదీన తెల్లవారు జామును 4 గంటలకు తాగిన మైకంలో హోటల్‌కు చేరుకుంది. ఉదయం పూట అల్పాహారాన్ని, చాయ్‌ని అందించడానికి హోటల్ కీపింగ్ స్టాఫ్ పదే పదే తలుపు తట్టారు. అయినా తలుపులు తెరుచుకోలేదు. ఆ విషయాన్ని హోటల్ మేనేజర్‌కు తెలియజేశారు. దాంతో తమ వద్ద ఉన్న తాళం చెవులతో హోటల్ హౌస్ కీపింగ్ స్టాఫ్ గది తలుపులు తెరిచారు. తన అనుమతి లేకుండా తలుపు తెరవడంపై ఆ నటి రెచ్చిపోయింది. హోటల్లో గొడవకు దిగింది. పోలీసులను కూడా పిలిచినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications