actress cheating case register bollywood pawan kalyan mahesh babu junior ntr patel hyderabad mumbai నటి చీటింగ్ కేసు బాలీవుడ్ పవన్ కల్యాణ్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ పటేల్ హైదరాబాద్ ముంబాయి
Actress: పవన్ కళ్యాణ్, మహేష్ బాబు హీరోయిన్ పై చీటింగ్ కేసు, ఎన్నికోట్లు అంటే, ఆరోజుల్లో !
ముంబాయి/ రాంచీ: నమ్మించి తన దగ్గర కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని మోసం చేసిందని ప్రముఖ హీరోయిన్ మీద చీటింగ్ కేసు పెట్టారు. సినిమా తీస్తున్నానని, డబ్బులు సహాయం చెయ్యాలని కోట్ల రూపాయలు తీసుకుని కొన్ని సంవత్సరాల నుంచి తనకే త్రీడి సినిమా చూపిస్తోందని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ తదితరులతో ఆడిపాడి ఓ ఊపుఊపేసిన ఆ హీరోయిన్ మీద చీటింగ్ కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది.
Illegal affair: భర్త ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో లేడీ టీచర్, డ్రాయింగ్ టీచర్ బొమ్మ రివర్స్!

దుమ్ము దులిపేసిన మేడమ్
హృతిక్ రోషన్ హీరోగా నటించిన కహోనా ప్యార్ హై సినిమా బాలీవుడ్ లో ఎన్ని సంచలనాలు సృష్టించిందో సినీ ప్రేక్షకులకు కొత్తగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన అమీషా పటేల్ ఓ ఊపుఊపేసింది. సన్నీ డియోల్ హీరోగా నటించిన గదర్ ఏక్ ప్రేమ్ కహానీ సినిమాలో కూడా అమీషా పటేల్ నటించి మంచిపేరు తెచ్చుకుని ఓ ఊపుఊపేసింది.

దక్షిణాదిని వదల్లేదు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 2000లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బద్రి సినిమాలో అమీషా పటేల్, రేణూదేశాయ్ నటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు హీరో మహేషా బాబు హీరోగా నటించిన నాని (ఎస్ జే. సూర్యా డైరెక్టర్), జూనియర్ ఎన్టీర్ నటించిన నరసింహుడు సినిమాతో పాటు తమిళ సినిమాల్లో నటించిన అమీషా పటేల్ మంచి పేరుతో పాటు అభిమానులను సంపాధించుకుంది.

జస్ట్ రూ. 2. 50 కోట్లు
దేసి మ్యాజిక్ అనే బాలీవుడ్ సినిమాను తాను నిర్మిస్తున్నానని, మీరు తనకు ఆర్థిక సహాయం చెయ్యాలని నటి అమీషా పటేల్ తనకు మనవి చేసిందని, ఆమె చెప్పినట్లు ఆమె బ్యాంక్ అకౌంట్ కు తాను రూ. 2.50 కోట్లు బదిలి చేశానని అజయ్ కుమార్ సింగ్ ఆరోపిస్తున్నాడు. డబ్బులు తీసుకున్న అమీషా పటేల్ తనకు డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని అజయ్ కుమార్ సింగ్ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాడు.

చెక్ బౌన్స్... అరెస్టు వారెంట్.... చీటింగ్ కేసు
అమీషా పటేల్ దేసి మ్యాజిక్ అనే సినిమాను మద్యలోనే నిలిపివేయడంతో ఆ సినిమా అటకెక్కింది. అమీషా పటేల్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో అజయ్ కుమార్ సింగ్ కోర్టును ఆశ్రయించాడు. 2017లో అజయ్ కుమార్ సింగ్ కు అమీషా పటేల్ కు పరిచయం అయ్యింది. కేసు విచారణకు సక్రమంగా హాజరుకాకపోవడంతో 2019లో రాంచీ కోర్టు అమీష్ పటేల్ కు అరెస్టు వారెంట్ జారీ చేసింది. తరువాత కోర్టుకు హాజరైన అమీషా పటేల్ బెయిల్ తీసుకుని కోర్టు విచారణకు హాజరౌతోంది.

మేడమ్ ఫ్యాన్స్ కు షాక్
ఇప్పటికే వాదనలు విన్న కోర్టు ఇరు వర్గాల నుంచి లిఖితపూర్వకంగా సమాచారం తెలుసుకుంది. అమీషా పటేల్ మోసం చేసిందని వెలుగు చూడటంతో ఆమెపై చీటింగ్ కేసు నమోదు చెయ్యాలని జార్ఖండ్ హైకోర్టు స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అమాయకంగా ముద్దుగుమ్మలా ఉండే అమీషా పటేల్ మీద చీటింగ్ కేసు నమోదు కావడంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు.