Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Actress: హాట్ వెబ్ సిరీస్ యాక్టర్స్, జల్సా కోసం ఫ్రెడ్ రూమ్ లో ?, సురభి, మోసిన్ రియల్ క్రైమ్ స్టోరి !

ముంబాయి/చెన్నై: వెబ్ సిరీస్ లో, టీవీ సీరియల్స్ లో నటిస్తున్న ఇద్దరు యువతులు తప్పుదోవపట్టారు. ఇంతకాలం లగ్జరీ జీవితం గడిపిన అమ్మాయిలు ఒక్కసారిగా ఆర్థిక సమస్యలతో సతమతం అయ్యారు. వెబ్ సిరీస్, టీవీ సీరియల్స్ షూటింగ్స్ నిలిచిపోవడం, చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇద్దరు అమ్మాయిలు చోరీ చేశారు.స్నేహితురాలి పెయింగ్ గెస్ట్ (PG)లో తలదాచుకున్న వెబ్ సిరీస్ అమ్మాయిలు ఏకంగా లక్షల రూపాయలు చోరీ చేసి సీసీటీవీ కెమెరాల్లో బుక్కైపోయారు. హాట్ వెబ్ సిరీస్ యాక్టర్స్ సురభి, మోసిన్ రియల్ క్రైమ్ స్టోరీ వెలుగు చూడటంతో సాటి నటీనటులు షాక్ అయ్యారు.

టీవీ సీరియల్స్ తో గుర్తింపు

టీవీ సీరియల్స్ తో గుర్తింపు

మహారాష్ట్రకు చెందిన సురభి సురేంద్ర లాల్ శ్రీవాస్తవ (25), మోసినా ముఖ్తార్ షేక్ (19) అనే ఇద్దరు యువతులు ముంబాయిలో నివాసం ఉంటున్నారు. అనేక హిందీ సీరియల్స్ లో సురభి, మోసిన్ నటించారు. పలు టీవీ సీరియల్స్ లో నటించిన సురభి, మోసినాకు తరువాత హిందీ వెబ్ సిరీస్ ల్లో అవకాశాలు వచ్చాయి.

 హాట్ బెబ్ సిరీస్

హాట్ బెబ్ సిరీస్

హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రైమ్ పెట్రోల్, సావాధన్ ఇండియా తదితర టీవీ సిరియల్స్ తో పాటు అనేక హాట్ వెబ్ సిరీస్ ల్లో సురభి, మోసిన్ నటించారు. కొన్ని హాట్ హాట్ వెబ్ సిరీస్ లో కూడా వీరిద్దరు నటించారని తెలిసింది. టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్ ల్లో నటిస్తున్న సురభి, మోసిన్ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డారని తెలిసింది.

కరోనా, లాక్ డౌన్ దెబ్బతో సమస్యలు

కరోనా, లాక్ డౌన్ దెబ్బతో సమస్యలు


కరోనా వైరస్ కారణంగా సినిమాలు, టీవీ సీరియల్స్ షూటింగ్స్ నిలిపివేసిన విషయం తెలిసిందే. టీవీ సీరియల్స్ షూటింగ్స్ నిలిపివేయడంతో సురభి, మోసిన్ లకు అవకాశాలు లేక ఇద్దరూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెబ్ సిరీస్ షూటింగ్స్ కూడా నిలిపివేయడంతో సురభి, మోసిన్ విలాసాలకు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 ఆశ్రయం ఇచ్చిన ఫ్రెండ్

ఆశ్రయం ఇచ్చిన ఫ్రెండ్

ముంంబాయిలోని ఆరయ్ కాలనీలోని రాయల్ పామ్ ఏరియాలో సురభి స్నేహితురాలు పేయింగ్ గెస్ట్ (PG)లో ఉంటోంది. మాకు తినడానికి తిండికూడా లేదని, నువ్వు మీ పీజీ హాస్టల్ లో ఆశ్రయం ఇవ్వాలని సురభి ఆమె స్నేహితురాలికి చెప్పింది. తరువాత సురభి, మోసిన్ పీజీ హాస్టల్ ల్లోకి అక్కడే కొన్ని రోజుల నుంచి ఇద్దరూ ఉంటున్నారు.

రూ. 3 లక్షలు చోరీ

రూ. 3 లక్షలు చోరీ


పీజీలోని స్నేహితురాలి ద్వారా కొందరు మహిళలు సురభి, మోసిన్ కు పరిచయం అయ్యారు. పక్క రూమ్ లో ఉంటున్న మహిళ లాకర్ లో భారీ మొత్తంలో డబ్బులు ఉన్నాయని సురభి, మోసిన్ కు తెలిసింది. పీజీలో మహిళ కళ్లు కప్పిన సురభి, మోసిన్ ఆమె లాకర్ లో ఉన్న రూ. 3, 28,00 చోరీ చేసి చాకచక్యంగా తప్పించుకున్నారు.

పీజీలో బాగా నటించారు

పీజీలో బాగా నటించారు

తన లాకర్ లో డబ్బు చోరీ అయ్యిందని తెలుసుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతకాలం పీజీలో ఏ చోరీ జరగలేదని, సురభి, మోసిన్ వచ్చిన తరువాతే చోరీ అయ్యింది. తన రూమ్ లోకి కొత్తగా వచ్చిన సురభి, మోసిన్ తన డబ్బులు చోరీ చేసి ఉంటారని ఆ మహిళ పోలీసుల ముందు అనుమానం వ్యక్తం చేసింది.

Recommended Video

    Actress Sanjana Galrani Distributing Daily Food to Poor people during lockdown | Oneindia Telugu
    సీసీటీవీ కెమెరాల్లో

    సీసీటీవీ కెమెరాల్లో


    పీజీలోని సీసీటీవీ కెమెరాల్లో పరిశీలించగా సురభి, మోసిన్ డబ్బులు బ్యాగ్ లో పెట్టుకుని వెళ్లిన విషయం వెలుగు చూసింది. టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్ లో అవకాశాలు లేక ఒకేసారి ఇద్దరు యువతులు డబ్బులు చోరీ చేసి అరెస్టు కావడంతో కలకలం రేపింది. సురభి, మోసిన్ ల నుంచి కేవలం రూ. 50 వేలు మాత్రమే రికవరీ అయ్యిందని ముంబాయి పోలీసులు అంటున్నారు. ఇద్దరు టీవీ నటీమణులు అరెస్టు అయ్యారని ఏఎన్ఐ మీడియా కూడా వెల్లడించింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+