సూపర్ స్టార్ రజనీకాంత్ తో నటి కస్తూరి భేటీ: రాజకీయాల్లో ఎంట్రీ, ఎవ్వరూ పట్టించుకోలేదని !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ ను అలనాటి నటి కస్తూరి కలుసుకున్నారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని రజనీకాంత్ ఇంటికి వెళ్లిన కస్తూరి చాల సేపు సూపర్ స్టార్ తో చర్చలు జరిపారు. 1990లో కస్తూరి తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించారు.

ఇటీవల రజనీకాంత్ రాజకీయ రంగం ప్రవేశంపై కస్తూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ పై కస్తూరి చేసిన కామెంట్స్ పై సూపర్ స్టార్ అభిమానులు మండిపడ్డారు. తరువాత ప్లేట్ పిరాయించిన కస్తూరి చల్లగా రజనీకాంత్ ఇంటికి వెళ్లి వివాదానికి తెర తియ్యడానికి ప్రయత్నించారు.

Actress Kasturi, who has initially criticising Rajinikanth's political entry has met the superstar at his house

రజనీకాంత్ తో భేటీ అయిన తరువాత కస్తూరి ఓ ప్రకటన విడుదల చేశారు. రజనీకాంత్ తో తాను రాజకీయ అంశాల గురించి చర్చించానని వివరించారు. రజనీ సర్ కు తాను అభినందనలు తెలిపానని అన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ ఆలోచనలు, ప్రణాళికలు తాను అర్థం చేసుకున్నానని చెప్పారు.

రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం ఆశాజనకంగా ఉంటుందనే అభిప్రాయాన్ని కస్తూరి వ్యక్తం చేశారు. 1990లో దక్షిణ భారత దేశంలోని అన్ని బాషల సినీమాల్లో హీరోయిన్ గా నటించిన కస్తూరి తరువాత వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు. సినిమాల మీద ఆసక్తితో మళ్లీ చెన్నై చేరుుకున్న కస్తూరిని సినిమా ప్రముఖులు మాత్రం పట్టించుకోలేదు. అయితే నిత్యం ఏదో ఒక విషయంపై వార్తల్లోకెక్కి ఉచితంగా ప్రచారం పొందే ప్రయత్నాలు చేస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actress Kasturi, who has initially criticising Rajinikanth's political entry has met the superstar at his house in Chennai.
Please Wait while comments are loading...