గుజరాత్ లో ఎన్నికల ప్రచారం చేస్తా, అధికారం కాంగ్రెస్ పార్టీ దే, బహుబాష నటి కుష్బు !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: గుజరాత్ 2017 శాసన సభ ఎన్నికల కోసం ప్రచారం చేస్తానని బహుబాష నటి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కష్బు అన్నారు. ఇటీవల అనారోగ్యంతో శాస్త్ర చికిత్స చేయించుకున్న నటి కష్బు ఇంటికి చేరుకుని ఆరోగ్యంగా ఉన్నారు. నటి కుష్బు ఆరోగ్యం మెరుగుపడిన నేపథ్యంలో ఆమె హుషారుగా కనపడుతున్నారు.

సోమవారం నటి కుష్బు చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ గుజరాత్ లో జరుగుతున్న శాసన సభ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ లో తమిళ ప్రజలు ఎక్కువగా నివాసం ఉంటున్న ప్రాంతాల్లో తాను పర్యటించి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రచారం చేస్తానని చెప్పారు.

Actress Khushbu gets well after surgery, to campaing for congress in Gujarat polls

తనకు హిందీ బాష చాల బాగ వస్తోందని, అందు వలన గుజరాత్ లో శాసన సభ ఎన్నికల ప్రచారం చెయ్యడానికి ఎలాంటి ఇబ్బంది లేదని కష్బు చెప్పారు. డిసెంబర్ 5వ తేదీ తరువాత గుజరాత్ లో శాసన సభ ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉందని కుష్బు వివరించారు.

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు ఎన్నికల ప్రచార కార్యక్రమం షెడ్యూలు నిర్ణయిస్తోందని కుష్బు వివరించారు. గుజరాత్ లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని కుష్బు జోస్యం చెప్పారు. కుష్బు ఎన్నికల ప్రచారం విషయంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా షెడ్యూల్ ప్రకటించవలసి ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
All India Congress Committee national spokesperson and actress Khushbu Sundar, who underwent a surgery in stomach recently, has now recovered well is back to good health. The actress-turned-politician, who stayed away from party works for more than one week due to the surgery, is planning to campaign for Congress in the Gujarat Assembly elections.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి