కారు ప్రమాదంలో మలైకా అరోరాకు గాయాలు: ఆస్పత్రిలో చేరిక
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి మలైకా అరోరా శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. శనివారం పుణెలో ఏర్పాటు చేసిన ఓ ఫ్యాషన్ ఈవెంట్‌లో పాల్గొని తిరిగి వస్తుండగా మలైకా ప్రయాణిస్తున్ నకారు ప్రమాదానికి గురైంది. గాయపడిన ఆమెను నవీ ముంబైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో మలైకా అరోరా కంటికి గాయమైందని, ఆరోగ్యం నిలకడగా ఉందని మలైకా సోదరి అమృతా అరోరా మీడియాకు తెలిపారు. అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ముంబై-పుణె ఎక్స్ ప్రెస్ హైవేపై మూడు కార్లు ఒకదానిని మరోటి ఢీకొనడంతోనే మలైకా గాయపడినట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పండగ రోజున రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం
ఉగాది పండగ రోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపత్తూరు వద్ద ఓ ట్రక్కు 100 అడుగుల లోయలో పడిపోయిన ఘటనలో అక్కడికక్కడే 11 మంది మృతిచెందారు. మరో 20 మంది తీవ్రగాయాలపాలయ్యారు. మృతులంతా పులియూరు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.
తిరుపత్తూరు జిల్లాలోని సెంబరై ఆలయ దర్శనానికి బయల్దేరి వెళ్తుండగా.. ట్రక్కు ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో ట్రక్కులో 30 మందికి పైగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున, గాయపడినవారికి రూ.50వేల చొప్పున పరిహారం అందించనున్నట్టు ప్రకటించారు.












Click it and Unblock the Notifications