నటి పూజాగాంధీ కొర్టు విచారణకు పదేపదే డుమ్మా, ఉదయం నుంచి మద్యాహ్నం వరకు కోర్టులోనే !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ఎన్నికల నియమాలు ఉల్లంచారని నమోదు అయిన కేసులో కన్నడ నటి పూజాగాంధీ గురువారం కోర్టు ముందు హాజరైనారు. కర్ణాటకలోని రాయచూరు జేఎంఎఫ్ సీ 2వ న్యాయస్థానం ముందు హాజరైన పూజాగాంధీని కోర్టు హాల్ లో వేచి ఉండాలని న్యాయమూర్తి పూర్ణిమా యాదవ్ ఆదేశించారు.

2013లో కర్ణాటకలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో పూజాగాంధీ రాయచూరు నియోజక వర్గం నుంచి బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆ సందర్బంలో పూజాగాంధీ ఎన్నికల నియమాలు ఉల్లంఘించి ప్రచారం కోసం అధిక సంఖ్యలో వాహనాలు ఉపయోగించారని కేసు నమోదు అయ్యింది.

Actress Pooja Gandhi appears before Raichur jmfc court in Karnataka

గత జూన్ 19వ తేదీ కోర్టు విచారణకు పూజాగాంధీ హాజరుకాలేదు. ఆ సందర్బంలో న్యాయమూర్తి పూర్ణిమా యాదవ్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. గురువారం ఉదయం పూజాగాంధీ కోర్టు ముందు హాజరైనారు. కోర్టు విచారణకు పదేపదే డుమ్మా కొడుతున్న పూజాగాంధీపై కోపంగా ఉన్న న్యాయమూర్తి పూర్ణిమా యాదవ్ ఉదయం నుంచి కోర్టు హాలులోనే కుర్చోవాలని ఆదేశించారు. మద్యాహ్నం మూడు గంటల వరకు కోర్టు హాలులోనే పూజా గాంధీ గడిపింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
JMFC Court had earlier issued an arrest warrant against Gandhi since she did not appear during last five hearing. On Thursday, Pooja presented herself before the court. She was remanded in judicial custody for a while

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి