రాజకీయ పార్టీ నేతపై ఎన్టీఆర్ హీరోయిన్ ఫైర్ ..దెబ్బకు రాజీనామా
దేశ రాజకీయాలను ఓసారి పరిశీలిస్తే.. ఉత్తర రాష్ట్ర రాజకీయాలు..దక్షిణ రాష్ట్ర రాజకీయాలుగా విభజించి చూడాల్సిందే. దేశ రాజకీయాల్లో ఉత్తర రాష్ట్ర రాజకీయ నాయకులదే హవా. దేశ ప్రధానులు,కేంద్ర మంత్రులు మెజార్టీ ఉత్తర రాష్ట్రాలకు చెందిన వారే ఉంటారు. దక్షిణ రాష్ట్ర రాజకీయ నాయకులంటే వారికి మొదటి నుంచి కూడా చిన్నచూపే. ఓట్ల కోసం తప్పిస్తే..ఇక్కడ వారికి పెద్దగా ప్రాధాన్యత ఉండదనేది సుస్పష్టం. తాజాగా ఇది మరోసారి నిరూపితం అయింది. ఓవర్సిస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఆయన ఇటీవల మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశ ప్రజలు ఆఫ్రికన్స్‌లా కనిపిస్తారంటూ హేళనగా మాట్లాడారు. దక్షిణ భారతదేశ ప్రజలు గురించి శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను దక్షిణ భారతదేశానికి చెందినవారిని, నేను భారతీయులుగా కనిపిస్తున్నాను అంటూ శామ్ పిట్రోడాకు కౌంటరిచ్చారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. మనం ఇండియన్స్ కానీ శామ్ పిట్రోడాకు ఆఫ్రికన్‌లా కనిపిస్తాము అని కొందరు అంటుండగా.. మరి కొందరు వారి ఫొటోలను షేర్ చేస్తూ మేము ఇండియన్‌లా కనిపిస్తున్నామా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

అయితే దీనిపై సినీ సెలబ్రెటీలు సైతం స్పందిస్తున్నారు. తాజాగా హీరోయిన్ ప్రణీత సుభాష్ సైతం దీనిపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా శామ్ పిట్రోడాకు ఆమె కౌంటరిచ్చారు. నేను దక్షిణ భారత దేశానికి చెందినవారిని, నేను భారతీయురాలుగా కనిపిస్తున్నానంటూ శామ్ పిట్రోడాను ట్యాగ్ చేశారు. ఎన్నికల సమయంలో కావడంతో బీజేపీకి ఇదొక అస్త్రంగా దొరికింది. శామ్ పిట్రోడా దక్షిణ భారతీయులను ఆఫ్రికన్స్‌తో పోల్చడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద డ్యామేజీగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా శామ్ పిట్రోడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పదవితో పాటు , కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. శామ్ పిట్రోడా రాజీనామాను కాంగ్రెస్ అధిష్టానం వెంటనే ఆమోదించడం జరిగింది.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం!












Click it and Unblock the Notifications