మెగాస్టార్ కు నచ్చిన హీరోయిన్ కు లక్కీ చాన్స్ ఇచ్చిన ప్రధాని మోదీ, ఎంపీగా అక్కడి నుంచి పోటీ !
లోక్ సభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న సందర్బంలో ఎన్డీఏ కూటమిలోని పార్టీలు మాకు అన్ని సీట్లు కావాలి, ఇన్ని సీట్లు కావాలి అంటూ బీజేపీ ముందు డిమాండ్ చేస్తున్నాయి. దక్షిణ భారతదేశంలోని ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు సీట్లు కేటాయించే విషయంలో బీజేపీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలో మిత్రపక్షాలు కోరుకుంటున్న సీట్లు ఇవ్వడానికి బీజేపీ హైకమాండ్ చర్చలు జరుపుతోందని తెలిసింది.
ఇప్పటికే కర్ణాటకలో జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఆ పార్టీకి నాలుగు నుంచి ఆరు సీట్లు ఇచ్చే విషయంలో తర్జనభర్జనలు పడుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు, తెలంగాణలో బీజేపీకి ఇంతో అంతో బలం ఉండటంతో అక్కడ మరోసారి సత్తా నిరూపించుకోవాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది.

తమిళనాడులో ఏఐఏడీఎంకే (మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి వర్గం)తో తెగతెంపులు చేసుకున్న బీజేపీ మరి కొన్ని పార్టీలతో కలిసి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని నిర్ణయించుకుంది ఎన్డీలో చేరిన తమిళనాడుకు చెందిన పార్టీలు ఇప్పుడు లోక్ సభ సీట్ల పంపిణి విషయంలో తమిళనాడు బీజేపీ నాయకులతో చర్చలు జరుపుతున్నాయి. ఇదే సమయంలో ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే అయిన శరత్ కుమార్ కు చెందిన సమత్తువ మక్కల్ కట్చి పార్టీ కూడా పలు లోక్ సభ నియోజక వర్గాలు కావాలని బీజేపీ హైకమాండ్ కు మనవి చేసింది
ఎన్డీలో ఇప్పటికే టీఎంసీ, జననాయగ పుదియ నీది, జాన్ పాండియన్ పార్టీలతో పాటు శరత్ కుమార్ సొంత పార్టీ సమత్తువ మక్కల్ కట్చి పార్టీ చేరాయి. ఇప్పుడు సమత్తువ మక్కల్ కట్చి పార్టీ బలంగా ఉన్న విరూద్ నగర్, కన్యాకుమారితో పాటు మరో రెండు లోక్ సభ నియోజక వర్గాలు తమకు ఇవ్వాలని శరత్ కమార్ బీజేపీ హైకమాండ్ కు మనవి చేశారు. ఈ విషయంలో ఇప్పటికే పలుసార్లు బీజేపీ నాయకులతో శరత్ కుమార్ చర్చలు జరిపారు.
ఈ మేరకు కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్, బీజేపీ సీనియర్ నాయకుడు హెచ్. రాజా, బీజేపీ తమిళనాడు ఇన్ చార్జ్ అరవింద్ మీనన్‌లు తమతో చర్చలు జరిపారని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని శరత్ కుమార్ తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే విషయం, ఎవరికి ఏ సీటు ఇవ్వాలి అనే నిర్ణయాధికారం తమ పార్టీ కార్యవర్గం ఇప్పటికే తనకు అధికారం కల్పించిందని, అందుకే వచ్చే ఎన్నికల్లో బీజేపీ కూటమిలో చేరామని శరత్ కుమార్ చెప్పారు.

విరుదునగర్ పార్లమెంట్ స్థానం నుంచి నటి, శరత్‌కుమార్ భార్య రాధిక పోటీ చేస్తున్నట్టు సమాచారం. రాధికా శరత్‌కుమార్ కమలం గుర్తుపైనే పోటీ చేస్తారని కూడా శరత్ కుమార్ సన్నిహితులు, వాళ్ల పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అంటున్నారు.
డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌కు విరుదునగర్ నియోజకవర్గం కేటాయించే అవకాశం ఉంది. అలాగే అక్కడ మళ్లీ కాంగ్రెస్ తరపున ఎంపీ మాణిక్కం ఠాగూర్ పోటీ చేస్తారని అంటున్నారు. బీజేపీ సింబల్ మీద నటి రాధికా శరత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాణిక్కం ఠాగూర్‌పై పోటీ చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications