శశికళను కలిసిన అతిలోక సుందరి శ్రీదేవి: రహస్యంగా ?
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అలనాటి అందాల తార, అతిలోకసుందరి శ్రీదేవి అన్నారు. జయలలిత లేని లోటును తమిళనాడు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని శ్రీదేవి చెప్పారు.
చెన్నైలోని మెరినా బీచ్ లోని జయలలిత సమాధి దగ్గర శ్రీదేవి నివాళులు అర్పించారు. జయలలితతో తనకు ఉన్న అనుబంధాన్ని శ్రీదేవి గుర్తు చేసుకున్నారు. జయలలిత సమాధి దగ్గర ఒక్కసారిగా శ్రీదేవి ఉద్వేగానికి గురైనారు.

అనంతరం శ్రీదేవి నేరుగా పోయెస్ గార్డెన్ చేరుకుని జయలలిత నెచ్చెలి శశికళను కలుసుకుని ధైర్యం చెప్పారు. ఇదే సమయంలో శ్రీదేవి, శశికళ చాలసేపు మాట్లాడుకున్నారు. ఆసమయంలో ఇతరులను లొపలికి అనుమతించలేదు. సినీరంగం నుంచి ప్రముఖలు ఎవ్వరూ ఇప్పటి వరకే శశికళను కలువలేదు.
సినీరంగానికి చెందిన ప్రముఖులలో కేవలం ఒక్క శ్రీదేవి మాత్రం మొదటి సారి శశికళను కలుసుకున్నారు. ఇప్పటి వరకూ ప్రముఖ నటీనటులు ఎవ్వరూ శశికళను కలవలేదు. అందరూ జయలలిత సమాధి దగ్గర నివాళులు అర్పించి అటు నుంచి అటే వెళ్లిపోయారు. ఇప్పుడు శ్రీదేవి నేరుగా పోయెస్ గార్గెన్ చేరుకుని శశికళను కలవడంతో అన్నాడీఎంకేలో అప్పుడే చర్చ మొదలైయ్యింది.












Click it and Unblock the Notifications