నా కుమార్తెను కాపాడండి: నటి త్రీష తల్లి: జల్లికట్టు ఎఫెక్ట్ !
చెన్నై: జల్లికట్టు సాహస క్రీడను వ్యతిరేకిస్తున్నారని ఆరోపిస్తూ నటి త్రిష మీద తమిళనాడు ప్రజలు మండిపడుతున్న సందర్బంగా మా కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని త్రీష తల్లి ఉమ చెన్నై నగర పోలీసు కమిషనర్ జార్జ్ ను కలిసి మనవి చేశారు.
జల్లికట్టు నిషేదానికి కారణం అయిన పేటా సంస్థ, ఆ సంస్థ ప్రచారకురాలిగా ఉన్న త్రిష మీద తమిళనాడు ప్రజలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే త్రిష మరణించిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఓ ఫోటో పోస్టు చేసి అభ్యంతరకరమైన మెసేజ్ లు పెట్టారు.

మధురై సమీపంలోని కారైకుడి ప్రాంతంలో త్రిష నటిస్తున్న గర్జన సినిమా షూటింగ్ ను అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో త్రిష నటిస్తున్న సినిమా షూటింగ్ కు పోలీసు రక్షణ కల్పించాలని ఆమె తల్లి ఉమ పోలీసు అధికారులను కలిశారు.
అంతే కాకుండ చెన్నై నగరంలోని మా ఇంటికి రక్షణ కల్పించాలని త్రిష తల్లి ఉమ పోలీసు అధికారులకు మనవి చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తామని చెన్నై నగర పోలీసు అధికారులు హామి ఇచ్చారు. అయితే ఇప్పటికే త్రిష సినిమా షూటింగ్ ను అడ్డుకున్న తమిళ సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.