కొంపముంచిన అదాని: భారీ నష్టాల్లో షేర్లు
Adani Enterprises Share Price: దేశీయ స్టాక్ మార్కెట్ వ్యవహారాలను పర్యవేక్షించే సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాపై అమెరికాకు చెందిన ప్రముఖ రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్.. బాంబు పేల్చింది. ఏకంగా సెబి ఛైర్‌పర్సన్ మాధవి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్‌ను లక్ష్యంగా చేసుకుంది.
దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానికి చెందిన అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో మాధవి, ధవల్ బుచ్ దంపతులకు భారీగా వాటాలు ఉన్నాయని తెలిపింది. పరోక్షంగా- అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువల పెరగడానికి కారకులు అయ్యారని, వాటాలను కలిగివుండటం వల్ల వాళ్ల ఆస్తులనూ పెంచుకున్నారని ఆరోపించింది.

అదాని గ్రూప్‌కు చెందిన విదేశీ ఫండ్స్‌లల్లో మాధవి దంపతులకు అంతర్గత వాటాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రత్యేకించి బెర్ముడా, మారిషస్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన ఓ నివేదికను తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ.
అదానీ గ్రూప్‌లో అనుమానిత ఆఫ్‌షోర్ షేర్ హోల్డర్లపై సెబి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీకి లబ్ది కలిగించేలా వ్యవహరించిన విషయాల్లో మాధవి బుచ్‌కు చిక్కులు తప్పకపోవచ్చని భావిస్తున్నామంటూ వ్యాఖ్యానించింది హిండెన్ బర్గ్ సంస్థ.
ఈ ఆరోపణలను మాధవి బుచ్ దంపతులు తోసిపుచ్చారు. దీన్ని వ్యక్తిత్వ హననంగా అభివర్ణించారు. హిండెన్‌బర్గ్ సంస్థ తన తాజా నివేదికలో చేసినవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలని చెప్పారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని వివరించారు. దీనిపై త్వరలోనే వివరణాత్మక ప్రకటన జారీ చేస్తామని వారు చెప్పారు.
తాజాగా అదానీ గ్రూప్ దీనిపై స్పందించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆ సంస్థ అధికార ప్రతినిధి ఓ ఒక ప్రకటన విడుదల చేశారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన తాజా నివేదికలో పొందుపర్చిన అంశాలన్నీ అవాస్తవాలని పేర్కొంది. ఈ నివేదికలో గల విషయాలను తోసిపుచ్చుతున్నట్లు తెలిపింది.
ఆ తరువాత కూడా మరో కొత్త నివేదికను బయటపెట్టింది హిండెన్‌బర్గ్ రీసెర్చ్. మాధవి బుచ్‌కు కొన్ని ప్రశ్నలను సంధించింది. అదానీ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన అంశాల గురించి పరిశోధించే బాధ్యత సెబికి ఉందని గుర్తు చేసింది. ఇందులో మాధవి బుచ్ వ్యక్తిగతంగా పెట్టుబడి పెట్టిన నిధులు, తమ నివేదికలో ప్రత్యేకంగా హైలైట్ చేశామని, వాటి గురించి ఆమె ప్రస్తావించ లేదని పేర్కొంది.
హిండెన్‌బర్గ్ నివేదిక- సెబి ఛైర్‌పర్సన్ మధ్య చోటు చేసుకుంటోన్న ఈ పరిణామాలు అదాని గ్రూప్ కంపెనీలకు చెందిన షేర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ ఉదయం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో అదాని షేర్ల ట్రేడింగ్ నష్టాలతో ఆరంభమైంది. మొత్తంగా ఏడు శాతం నష్టాల బారిన పడ్డాయి.
శుక్రవారం నాటి క్లోజింగ్ ట్రేడింగ్‌తో పోల్చి చూస్తే ఈ ఉదయం అదాని ఎంటర్‌ప్రైజెస్- 3.8, అదాని పోర్ట్స్ అండ్ సెజ్- 2.0, అదాని గ్రీన్ ఎనర్జీ- 3.5, అదాని గ్రీన్ సొల్యూషన్స్- 3.9, అదాని విల్మార్- 3.9, అదాని పవర్- 6.1, అంబుజా సిమెంట్స్- 1.2 శాతం మేర నష్టపోయాయి. ఆ తరువాత రెండో గంటలో కొంతమేర పుంజుకొన్నాయి గానీ.. రెడ్ జోన్‌లోనే ఆయా కంపెనీల షేర్లు ట్రేడింగ్ కావడం కనిపించింది.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications