వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూపాయికే పెట్రోల్! ఆ పెట్రోల్ బంక్ ముందు కిలోమీటర్ల మేర నిల్చిన వాహనాలు

|
Google Oneindia TeluguNews

ముంబై: దేశంలో రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. పలు ప్రాంతంలో లీటర్‌కు రూ. 100 దాటింది. దీంతో ప్రజలు తమ వాహనాల్లో ఇంధనం పోయించుకోవాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. కరోనా కష్టకాలంలో ఇంధన ధరలు పెరుగుతుండటం సామాన్యుడికి పెను భారంగానే మారింది.

ఇలాంటి సమయంలో రూపాయికే పెట్రోల్ పోస్తామంటే.. జనాల ఎగబడకపోతే ఏం చేస్తారు? మహారాష్ట్రలో ఇదే జరిగింది. మహారాష్ట్రలోని ఓ పెట్రోల్ బంక్‌లో రూపాయికే అందిస్తున్నారు. ఈ విషయం తెలిసి వందలాది మంది వాహనదారులు ఆ పెట్రోల్ బంక్ ముందు బారులు తీరారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత కుమారుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రే పుట్టిన రోజు సందర్భంగా డోంబివలీ యువసేన థానేలోని ఓ పెట్రోల్ బంక్‌లో రూపాయికే పెట్రోల్ అందించారు. దీంతో పెట్రోల్ కోసం వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. దీంతో ట్రాఫిక్ జాం అయ్యింది.

Aditya Thackerays birthday: Shiv Sena distributes petrol at Rs 1 per litre in Dombivli

అమర్నాథ్ వింకో నకాలోని ఓ పెట్రోల్ బంక్‌లో రూ. 50కి లీటర్ పెట్రోల్ అందించారు. ఇక్కడ మధ్యాహ్నం ఒంటిగంట వరకు వచ్చిన వారికి ఈ అవకాశం కల్పించారు. దీంతో ఆ సమయం వరకు వేచి చూసిన పలువురు పెట్రోల్ అందుకున్నారు.పెట్రోల్ ధర మండిపోతుండటంతో.. గాడిద బండి తయారు చేశాడు

పెట్రోల్ ధ‌ర‌ల‌ు మండిపోతుండటంతో ఓ వ్య‌క్తి వినూత్నంగా ఆలోచించి 10 వేల రూపాయ‌లు ఖ‌ర్చుచేసి జ‌ట్కాబండిని త‌యారు చేసుకున్నాడు. ర‌జ‌కుడైన సురేష్ ప్రతిరోజు దుస్తుల‌ను సేక‌రించేందుకు నాలుగు కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణం చేయాల్సి వస్తోంది. దీంతో సురేష్ త‌న‌ద‌గ్గ‌ర ఉన్న గాడిదెను జ‌ట్కా బండికి క‌ట్టి రాయ‌దుర్గం వీధుల్లో ప్ర‌యాణం చేస్తున్నాడు. మోటార్ వాహ‌నాల వీల్స్ బండికి పెట్ట‌డంతో బండి వేగంగా పరుగులు తీస్తోందని చెబుతున్నాడు. ఇక‌పై తాను పెట్రోల్‌కు భయ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ంటున్నాడు.

English summary
Aditya Thackeray's birthday: Shiv Sena distributes petrol at Rs 1 per litre in Dombivli, in Thane.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X