వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ADR Report : ప్రాంతీయ పార్టీలు 55 శాతం-జాతీయ పార్టీలు 70 శాతం-అపరిచిత విరాళాలు

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు సేకరిస్తున్న విరాళాలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఇవాళ సంచలన నివేదిక బయటపెట్టింది. ఇందులో రాజకీయ పార్టీల్లో ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు అందుతున్న విరాళాల్లో 55 శాతం మొత్తానికి అసలు లెక్కలే లేవని, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తెలియదని పేర్కొంది. అలాగే వీరు సేకరిస్తున్న విరాళాల్లో 95 శాతం ఎన్నికల బాండ్ల ద్వారా లభిస్తున్నవే అనే మరో విషయాన్ని కూడా బయటపెట్టింది.

 ఏడీఆర్ తాజా రిపోర్ట్

ఏడీఆర్ తాజా రిపోర్ట్

దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణల కోసం పనిచేస్తున్న అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ సంస్ధ రాజకీయ పార్టీలు, వాటి కార్యకలాపాలు, వాటిలో చేపట్టాల్సిన మార్పులపై ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తుంటుంది. వీటిపై రాజకీయ పార్టీలే కాదు సాధారణ ప్రజల్లో సైతం ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. వీటిలో చాలా మటుకు రాజకీయ పార్టీలు రాజ్యాంగం, నిబంధనలకు వ్యతిరేకంగా చేపడుతున్న చర్యల్ని గుర్తు చేస్తూ వాటిని సరిచేసుకోవాల్సిన అవసరాన్ని చెబుతూ ఉంటుంది. దీంతో ఏడీఆర్ ఇచ్చే నివేదికలు ఎప్పుడూ విలువ ఉంటుంది. తాజాగా రాజకీయ పార్టీల విరాళాలపై ఏడీఆర్ సంచలన నివేదిక వెల్లడించింది.

 రాజకీయ పార్టీల విరాళాలు

రాజకీయ పార్టీల విరాళాలు

దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు సేకరిస్తున్న విరాళాలు, వాటి మూలాలు, వాటి వల్ల కలుగుతున్న దుష్పరిణామాలపై సైతం ఏడీఆర్ నివేదికలు ఇస్తుంటుంది. ఇదే కోవలో తాజాగా రాజకీయ పార్టీలు సేకరిస్తున్న విరాళాల మూలలపై నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఇప్పుడు రాజకీయ పార్టీలకు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు షాకిచ్చేలా ఉంది. ఇందులో వారు సేకరిస్తున్న విరాళాల మూలాల్ని ప్రశ్నించింది. అలాగే వారు ఎక్కడెక్కడి నుంచి విరాళాలు సేకరిస్తున్నారనే దానిపైనా వివరాలు వెల్లడించింది. దీంతో ఈ నివేదిక కూడా చర్చనీయాంశమవుతోంది.

 సగానికి పైగా విరాళాలకు లెక్కల్లేవ్

సగానికి పైగా విరాళాలకు లెక్కల్లేవ్

ప్రస్తుతం దేశంలో ఉన్న 25 ప్రాంతీయ రాజకీయ పార్టీలు 2019-20 ఆర్ధిక సంవత్సరంలో వివిధ మార్గాల్లో సేకరించిన విరాళాలపై ఏడీఆర్ అధ్యయనం చేసింది. ఇందులో 25 ప్రాంతీయ పార్టీలకు కలిపి వచ్చిన మొత్తం విరాళాల సంఖ్య రూ.803.24 కోట్లుగా అంచనా వేసింది. ఇందులో రూ.445.7 కోట్లకు లెక్కలు లేవని కూడా తేల్చింది. అంటే మొత్తం వారికి అందిన విరాళాల్లో 55 శాతం విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయో వివరాలు లేవని తెలిపింది. దీంతో ఈ విరాళాలు అక్రమ మార్గాల్లో వారికి వచ్చినవే అని చెప్పకనే చెప్పింది. దేశంలోని ప్రాంతీయ పార్టీలు సేకరించిన వాటిలో 55 శాతం విరాళాలకు లెక్కలేకుండా పోయిందని తేల్చిన ఏడీఆర్.. అదే జాతీయ పార్టీలు అయితే 71 శాతం విరాళాలకు లెక్కలు లేవని వెల్లడించింది. అంటే ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే దాదాపు 16 శాతం మొత్తం ఎక్కువగా ఉందన్న మాట. ప్రాంతీయ పార్టీలోత పోలిస్తే జాతీయ పార్టీలకు విదేశాల నుంచి అందుతున్న విరాళాలు, జాతీయ స్ధాయిలో అందుతున్న విరాళాలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారఇం.

 95 శాతం ఎన్నికల బాండ్ల నుంచే

95 శాతం ఎన్నికల బాండ్ల నుంచే

దేశంలో ప్రాంతీయ రాజకీయ పార్టీలకు అందిన విరాళాల మూలాలను వెలికితీసే క్రమంలో ఏడీఆర్ మరో కీలకమైన విషయాన్ని కూడా బయటపెట్టింది. ఇలా రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో 95 శాతం ఎన్నికల బాండ్ల ద్వారానే లభ్యమైనట్లు గుర్తించింది. లెక్కలు లేకుండా ప్రాంతీయ పార్టీలకు లభించిన విరాళాల మొత్తం రూ.445 కోట్లు కాగా... ఇందులో రూ.426 కోట్లు అంటే 95 శాతం ఎన్నికల బాండ్ల ద్వారానే వారికి లభించినట్లు ఏడీఆర్ తన తాజా నివేదికలో పేర్కొంది. మరో 4.976 కోట్లు మాత్రం ప్రజలు, కార్యకర్తల ద్వారా సేకరించిన స్వచ్చంద విరాళాల ద్వారా వచ్చినట్లు తెలిపింది.

 టాప్ లో టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ

టాప్ లో టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ

ఈ జాబితాలో దక్షిణాదిలోని పార్టీలు - టిఆర్ఎస్, టిడిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, డిఎంకె, జెడి(ఎస్) ఈ లెక్కల్లేని విరాళాల జాబితాలో టాప్ లో ఉన్నాయి. ఈ జాబితాలో ఒడిశాలోని అధికార బీజేడీ కూడా ఉంది. అత్యధిక "తెలియని" విరాళాలు ప్రకటించిన కొన్ని అగ్ర ప్రాంతీయ పార్టీలు: టిఆర్ఎస్ (రూ. 89.158 కోట్లు), టిడిపి (రూ. 81.694 కోట్లు), వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (రూ. 74.75 కోట్లు), బిజెడి (రూ. 50.586 కోట్లు), డిఎంకె (రూ. 45.50 కోట్లు) అని ఏడీఆర్ తన నివేదికలో తెలిపింది. అయితే ప్రాంతీయ పార్టీలు "తెలిసిన" దాతల నుండి స్వీకరించిన విరాళాలు (ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన సహకార నివేదిక నుండి అందుబాటులో ఉన్న దాతల వివరాలు) రూ. 184.623 కోట్లకు చేరాయి, ఇది వారి మొత్తం ఆదాయంలో 22.98%; వారు సభ్యత్వ రుసుములు, బ్యాంకు వడ్డీ, ప్రచురణల విక్రయం, పార్టీ లెవీ మొదలైన ఇతర తెలిసిన వనరుల నుండి మరో రూ. 172.843 కోట్లు (మొత్తం ఆదాయంలో 21.52%) పొందారు.

 ఏడీఆర్ సూచనలివే

ఏడీఆర్ సూచనలివే

రాజకీయ పార్టీల ఆదాయంలో చాలా ఎక్కువ శాతం అసలు దాతలు ఎవరో తెలియదు కాబట్టి దాతలందరి పూర్తి వివరాలను సమచార హక్కు చట్టం క్రింద ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచాలని ADR నివేదిక పేర్కొంది. విదేశీ నిధులు పొందే ఏ సంస్థ అయినా అభ్యర్థికి లేదా పార్టీకి మద్దతు ఇవ్వడానికి లేదా ప్రచారం చేయడానికి అనుమతించకూడదని సూచించింది. అన్ని విరాళాల చెల్లింపు విధానం కూపన్ల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం, సభ్యత్వ రుసుములు మొదలైన వాటిని పార్టీలు ప్రకటించాలని కోరింది. ఆడిట్ నివేదికలు, ఐటీ శాఖ, ఎన్నికల కమిషన్ కు సమర్పించాలని పేర్కొంది.

English summary
association for democratic reforms's latest report says that more than 50 percent of donations to regional parties came from unknown sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X