వెంకయ్య జోక్యం: అద్వానీకి మళ్లీ గది వచ్చేసింది

హైదరాబాద్: పార్లమెంటు హౌస్‌లో బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ గదిని ప్రభుత్వం పునరుద్ధరించింది. అద్వానీని గతంలోని గది నుంచి మార్చారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో తిరిగి ప్రభుత్వం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంది. నేమ్‌ప్లేట్ మాత్రం మార్చారు.

గతంలోని జాతీయ ప్రజాతంత్ర కూటమి (ఎన్డిఎ) వర్కింగ్ చైర్మన్‌గా అద్వానీ నేమ్‌ప్లేట్ ఉండేది. దాన్ని మాత్రం తొలగించారు. మంగళవారం అద్వానీ తన పాత గదిలోనే కూర్చున్నారు. కొంత మంది సిబ్బంది కూడా గదిలో ఉన్నారు.

Advani's Parliament Room Restored, With Changes in Nameplate

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడి జోక్యంతో అద్వానీకి తిరిగి ఆ గదిని ఇచ్చినట్లు తెలుస్తోంది. గతవారం తన నేమ్‌ప్లేట్ తీసేయడంతో అద్వానీ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఎంపిల ప్రమాణ స్వీకారం సందర్బంగా ఎనిమిదో వరుసలో కూర్చోవడం ద్వారా అద్వానీ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

సాధారణ పార్టీ నాయకుడి మాదిరిగా అద్వానీ బిజెపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో అద్వానీ అప్పుడు విశ్రాంతి తీసుకున్నారు. బిజెపి పార్లమెంటరీ పార్టీ చైర్మన్ పదవిలో కొనసాగుతున్నప్పటికీ ఆయన సాధారణ సభ్యుడిగా మాదిరిగా వ్యవహరించారు.

బిజెపి పార్లమెంటరీ పార్టీ చైర్మన్‌గా ఉన్నప్పటికీ అద్వానీ ఎన్డిఎ వర్కింగ్ చైర్మన్‌గా కొనసాగుతారా, లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మంగళవారం ఉదయం వెంకయ్య నాయుడు, సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్ గదికి వచ్చి అద్వానీ ఈ గదిలోనే కొనససాగుతారని ఆదేశాలు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+