Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆప్ఘాన్ సంక్షోభం: సీఏఏ ఎంత అవసరమో ఇప్పుడు తెలుస్తోంది: కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ఆవశ్యకతను ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులు తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. అస్థిర‌మైన‌ మన పొరుగు దేశం (ప్ఘనిస్తాన్ ప్ర‌స్తుతం సిక్కులు, హిందువులు ఎదర్కొంటున్న అత్యంత దయనీయ ప‌రిస్థితుల‌ను చూసిన‌ప్పుడే పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం(సీఏఏ) అమలు క‌చ్చితంగా అవ‌స‌ర‌మ‌న్న విష‌యం తెలుస్తుంద‌ని తెలిపారు.

సీఏఏ అమలు అవసరం ఏంటన్నది ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసేలా చేశాయని ఆదివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు హ‌ర్దీప్ సింగ్ పూరి. ఆదివారం ఉదయం ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌ నుంచి 168 మందిని ఇండియన్ ఎయిర్‌‌ఫోర్స్ విమానం ఢిల్లీకి చేర్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన వార్తను కోట్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.

కాగా, 2019, డిసెంబ‌ర్ 11న భారత పార్ల‌మెంట్ పౌర‌సత్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి(సీఏఏ) ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే. ఈ స‌వ‌ర‌ణ ప్ర‌కారం.. 2014, డిసెంబ‌ర్ కంటే ముందు మ‌న పొరుగు దేశాలైన ఆఫ్ఘ‌నిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ల నుంచి వ‌చ్చే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియ‌న్ల‌కు భార‌త పౌర‌స‌త్వం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. అయితే ముస్లింల‌కు మాత్రం ఇందులో చోటు క‌ల్పించ‌క‌పోవ‌డంపై అప్ప‌ట్లో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయితే, ఈ మూడు దేశాలు కూడా ముస్లిం మెజార్టీ దేశాలే కావడంతో వారికి అనుమతివ్వలేదు కేంద్రం.

 Afghan Crisis: The pain of Sikhs and Hindus shows that CAA was necessary: Hardeep Singh Puri

కానీ, ఈ చట్టం మతపరమైన వివక్షతో చేశారంటూ కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అన్ని మతాలను సమానంగా చూడాలని.. పొరుగు దేశాల్లో ఉండలేక వచ్చేసే ముస్లింలకు కూడా ఇక్కడ పౌరసత్వం ఇచ్చేలా సవరణ చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. అయితే పొరుగున ఉన్న మూడు దేశాలు మస్లిం దేశాలుగా ప్రకటించుకున్నవేనని.. అక్కడ మైనార్టీలైన హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, జైనులు, పార్శీలు, బౌద్ధులు మతపరమైన హింసకు గురవుతున్నారని, వారికి ఆశ్రయం కల్పించేందుకు మాత్రమే సీఏఏ తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా హర్దీప్ సింగ్ చేసిన వ్యాఖ్యలతో సీసీఏ అంశంపై మరోసారి తెరపైకి వచ్చింది.

తాలిబన్ల అరాచకాలు.. క్రిస్టియన్ వ్యక్తి చర్మం ఒలిచి వేలాడదీశారు

ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాలిబన్ల మాటలకు వారి చేతలకు అసలు పొంతనే లేదు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని... ఎవరినీ శత్రువుల్లా భావించమని,కక్ష సాధింపు చర్యలు ఉండవని తాలిబన్లు శాంతి వచనాలు వల్లించారు. కానీ ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్‌లో పరిస్థితి అందుకు పూర్తి విరుద్దంగా ఉంది. తాలిబన్ల అరాచకాలను తట్టుకోలేక అక్కడి ప్రజలు ఆర్తనాదాలు పెడుతున్నారు. అమెరికా మాజీ కాంగ్రెస్ నేత మార్క్ వాకర్ తాజాగా అమెరికన్ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబన్ల అరాచకాల గురించి వెల్లడించారు.

ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అత్యంత దారుణంగా ఉన్నాయని మార్క్ వాకర్ పేర్కొన్నారు.'ఆఫ్గనిస్తాన్‌లో జరుగుతున్న దారుణాల గురించి కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. ఓ క్రిస్టియన్ వ్యక్తిని తాలిబన్లు చిత్రహింసలకు గురిచేసినట్లు చెబుతున్నారు. అతని చర్మం ఒలిచి స్తంభానికి వేలాడదీశారని అంటున్నారు.' అని మార్క్ వాకర్ పేర్కొన్నారు. అతని కుటుంబ సభ్యుల ముందే తాలిబన్లు ఈ దారుణానికి పాల్పడ్డారని చెప్పారు.మంగళవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసిందన్నారు.

తాలిబన్ల పాలనలో ఎవరిపై కక్ష సాధింపు చర్యలు ఉండవని... మిలటరీతోనూ తమకెలాంటి శత్రుత్వం లేదని ఇటీవల తాలిబన్లు ప్రకటించారు. కానీ సైనికులను పట్టుకునేందుకు ఇంటింటికీ తాలిబన్లు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆడపిల్లల కుటుంబాలను వేధింపులకు,హింసకు గురిచేస్తున్నారు. వారి కూతుళ్లను తమతో పంపించాలని... తమకిచ్చి పెళ్లిళ్లు చేయాలని తాలిబన్లు ఆ కుటుంబాలను వేధిస్తున్నారు. కొన్నిచోట్ల యువతులను చెక్క పెట్టెల్లో నిర్బంధించి సెక్స్ బానిసలుగా ఇతర దేశాలకు తరలిస్తున్నారు.

మహిళా జర్నలిస్టులను ఇప్పటికే ఆయా మీడియా సంస్థలు ఇంటికి పంపించేశాయి. తాలిబన్ల పాలనలో మహిళల రాజకీయానికి తావు లేదని ఇటీవల వెలుగుచూసిన ఓ వీడియోలో తాలిబన్ల మాటలను బట్టి అర్థమైంది. స్వేచ్చ,హక్కులు మృగ్యమైన చోట ప్రస్తుతం తాలిబన్లు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఏ క్షణాన ఏ తాలిబన్ తుపాకీ తమను ఎక్కుపెడుతుందో తెలియని ఆందోళనలో బతుకుతున్నారు. దేశం విడిచి పారిపోయేందుకు వేలాది మంది కాబూల్ విమానాశ్రయానికి తరలివస్తున్నా... ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడి నుంచి వారిని తరలించడం అసాధ్యంగా కనిపిస్తోంది. భారత్‌,అమెరికాకు చెందిన వందలాది మంది కాబూల్‌లోనే చిక్కుకుపోయి ఇప్పటికీ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

కాబూల్ విమానాశ్రయం వద్ద 20 మంది మృతి

Recommended Video

    Rishabh Pant or Shreyas Iyer? Delhi Capitals yet to ink on captain for 2nd phase of IPL 2021

    తాలిబన్ల ఆధీనంలోకి ఆప్ఘానిస్థాన్ వెళ్లిన నాటి నుంచి కాబూల్ విమానాశ్రయంలో 20 మంది వరకు ప్రజలు మృతి చెందారని నాటో దళాలు పేర్కొన్నాయి. తాజాగా, విమానాశ్రయం ఆవరణలో తాలిబన్లు కాల్పులు జరపడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందారు. కాలూబ్ విమానాశ్రయం అమెరికా భద్రతా దళాల ఆధీనంలో ఉండగా.. విమానాశ్రయం చుట్టూ తాలిబన్లు పెద్ద ఎత్తున మోహరించారు. విమానాశ్రయానికి వచ్చేవారిని తాలిబన్లు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పలువురిని విమానాశ్రయానికి వెళ్లకుండా అడ్డుకుని తిరిగి పంపిస్తున్నారు. చంపుతామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. దీంతో విదేశాలకు వెళ్లాలనుకునే ఆప్ఘాన్ పౌరులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+