ఇక నుంచి ఈ-వీసా కంపల్సరీ: ఆప్ఘన్ నుంచి వచ్చేవారికి మస్ట్: కేంద్రం
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల క్రూర పాలన కంటిన్యూ అవుతోంది. దీంతో అక్కడ గల ప్రజలు ఇతర దేశాలకు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రజలు వివిధ దేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ దేశ పరిస్థితులు క్షీణించడంతో.. వెళ్లక తప్పడం లేదు. భారత్‌లోకి వచ్చే ఆఫ్ఘన్ ప్రజల విషయంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్ రావాలనుకునే ఆఫ్ఘన్ పౌరులు ఈ-వీసాతోనే దేశంలోకి ప్రవేశించాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది.ఆఫ్ఘనిస్థాన్‌లో భద్రతా పరిస్థితులు రోజురోజుకూ క్షీణిస్తున్నాయని అంగీకరించింది. దేశంలోకి ప్రవేశించే వారిని ఈ-ఎమర్జెన్సీ ఎక్స్-మిసలేనియస్ (e-Emergency X-Misc) వీసాలతో క్రమబద్ధీకరిస్తున్నామని అని వివరించారు. ఆఫ్ఘన్ పౌరులు భారత్‌కు రావాలంటే ఈ-వీసాలతోనే రావాలని నిర్ణయించాం అని హోంశాఖ తెలిపింది.

ప్రస్తుతం భారత్‌లోని ఆఫ్ఘన్ దేశస్థులకు ఇంతకుముందు జారీ చేసిన వీసాలు కూడా ఇకపై చెల్లుబాటు కావని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఆ దేశ పౌరులు భారత్‌కు రావాలంటే తప్పనిసరిగా ఈ-వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంచేసింది. ఆఫ్ఘనిస్థాన్‌లో భారత దౌత్య కార్యాలయాలు మూతపడిన కారణంగా ఈ వీసా దరఖాస్తులను ఢిల్లీలో పరిశీలిస్తామని అధికారులు చెప్పారు.
మరోవైపు ఆప్ఘాన్‌ను తాలిబన్లు తమ అధీనంలోకి తెచ్చుకున్న మరునాడు ఆగస్టు 16 నుంచి భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. భారత్ ఇప్పటివరకు 800కిపైగా మందిని అప్ఘానిస్తాన్ నుంచి తీసుకొచ్చింది. వీరిలో భారతీయులతోపాటు అఫ్గాన్ సిక్కులు, హిందువులు కూడా ఉన్నారు.
ఆప్ఘన్‌లో తాలిబాన్ల ఆటవిక పాలన కొనసాగుతోంది. దీంతో అక్కడ ఉండలేక వెళ్లేందుకు జనం విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఓ విమానంలో దాదాపు 600 మంది పైచిలుకు ప్రయాణించిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటపడేందుకు కాబూల్ విమానాశ్రయానికి ఇటీవల వేలాదిమంది వచ్చారు. విమానం రెక్కలపై కూర్చుని అయినా దేశం దాటాలని ప్రయత్నించి ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోటెత్తిన జనాన్ని అడ్డుకునేందుకు జరిపిన కాల్పుల్లో మరికొందరు బయలుదేరారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. వేలాదిమంది విమానాశ్రయం బయట ప్రతి రోజూ పడిగాపులు కాస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే రాయల్ మెరైన్‌కు చెందిన యూకే మాజీ కామాండో పాల్ 'పెన్' ఫార్తింగ్ తన భార్య కైసాను ఖాళీ విమానంలో తరలించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయనే ఈ ఫొటోలను షేర్ చేశారు. ఆమె ప్రయాణించిన 'సి-11 గ్లోబ్‌మాస్టర్' మిలటరీ విమానం ఖాళీగా ఉంది.












Click it and Unblock the Notifications