పాకిస్తాన్ పై కేంద్రం యూటర్న్..! నిన్న గుట్టుగా ఎత్తేసి.. విమర్శలతో మళ్లీ..!
పాకిస్తాన్ విషయంలో కేంద్రం తీసుకున్న మరో నిర్ణయం బ్యాక్ ఫైర్ అయింది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ విషయంలో తీసుకున్న ఓ నిర్ణయాన్ని కేంద్రం గుట్టుగా వెనక్కి తీసుకుంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. అయితే దాని ప్రభావం మాత్రం క్షేత్రస్ధాయిలో కనిపించింది. దీంతో తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మళ్లీ ఆ నిర్ణయాన్ని పునరుద్దరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపైనా ఎక్కడా అధికారిక ప్రకటనలు లేవు.
కశ్మీర్లోని పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ కు కేంద్రం వరుస షాక్ లు ఇచ్చింది. ముఖ్యంగా పాకిస్తాన్ కు చెందిన పలు న్యూస్ ఛానళ్లతో పాటు సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలపై కేంద్రం అప్పట్లో నిషేధం విధించింది. ఆపరేషన్ సిందూర్ పై తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయన్న కారణంతో వీటిపై నిషేధం విధించారు. దీంతో భారత్ లో పాక్ టీవీ ఛానళ్ల యూట్యూబ్ ప్రసారాలు, సెలబ్రిటీల సోషల్ అకౌంట్లు కనిపించకుండా పోయాయి.

అయితే ఉన్నట్లుండి ఏం జరిగిందో తెలియదు కానీ నిన్న హఠాత్తుగా కేంద్రం పాకిస్తాన్ కు చెందిన పలు యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా ఖాతాలపై నిషేధాన్ని అనధికారికంగా ఉపసంహరించుకుంది. దీంతో ఆయా ఛానళ్లు, సోషల్ మీడియా అకౌంట్లు తిరిగి యథావిధిగా పనిచేశాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. పాకిస్తాన్ పై కేంద్రం ఎందుకింత మెతక వైఖరి వహిస్తోందన్న చర్చ మొదలైంది. దీంతో కేంద్రం తిరిగి వీటిపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో తిరిగి ఈ అకౌంట్లన్నీ భారత్ లో బ్లాక్ అయ్యాయి.
గతంలో కేంద్రం నిషేధించిన విధించిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పాకిస్తానీ సెలబ్రిటీలు సబా కమర్, మావ్రా హొకేన్, అహ్మద్ రజా మీర్, హనియా అమీర్, యుమ్నా జైదీ, డానిష్ తైమూర్ వంటి వారివి ఉన్నాయి. అలాగే హమ్ టీవీ, ఏఆర్వై డిజిటల్, హర్ పాల్ జియో వంటి పాకిస్తానీ న్యూస్ ఛానళ్లు నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానళ్లు కూడా ఉన్నాయి. నిన్న వీటిపై నిషేధం విధించిన కేంద్రం ఇవాళ వెనక్కి తీసుకుంది.
-
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
ఒక్క దెబ్బతో దివాలా తీసిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి ఆ పని చేసేందుకూ రెడీ.. -
మోడీ చెప్పిన అతిపెద్ద నిర్ణయాలివేనా ? ఎంపీలకు తేల్చేసిన కేంద్రం..! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications