వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనం దగ్గర రికార్డు స్ధాయిలో డబ్బు-30.88 లక్ష కోట్లకు చేరిక-నోట్ల రద్దు తర్వాత 72 శాతం పెరుగుదల

|
Google Oneindia TeluguNews

2016లో చేసిన ప్రధాని మోడీ చేసిన నోట్ల రద్దు ప్రకటన తర్వాత జనం దగ్గర డబ్బంతా క్రమంగా బ్యాంకుల్లోకి చేరింది. నల్లడబ్బు కాస్తా తెల్లగా మారిపోయింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు తిరిగి జనం వద్ద భారీ స్ధాయికి నగదు నిల్వలు చేరుకున్నాయి. ఇలా జనం దగ్గర పోగుపడిన నగదు నిల్వల విలువ రూ.30.88 లక్షల కోట్లుగా తాజాగా నిర్ధారించినట్లు జాతీయ వార్తాపత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం వెల్లడించింది.

 జనం దగ్గర డబ్బు

జనం దగ్గర డబ్బు

తాజాగా అక్టోబర్ 21 వరకూ దేశంలో జనం దగ్గర ఉన్న డబ్బు విలువ రూ.30.88 లక్షల కోట్లుగా నిర్ధారణ అయింది.
నోట్ల రద్దు తర్వాత ఇంత భారీ సంఖ్యలో జనం దగ్గర డబ్బు పోగుపడటం చర్చనీయాంశవుతోంది. ప్రభుత్వాలు ఎన్ని పన్నులు విధిస్తున్నా, జనంలో ఈ స్ధాయిలో డబ్బు పోగుపడటంపై రకరకాల చర్చలు కూడా జరుగుతున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం వద్ద ఉండాల్సిన డబ్బు కంటే జనం దగ్గర ఇంత భారీ సంఖ్యలో డబ్బు ఉండటం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. ఈ వివరాల్ని జాతీయ ఆంగ్ల వార్తా పత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనంలో వెల్లడించింది.

నోట్ల రద్దు తర్వాత 72 శాతం పెరిగి..

నోట్ల రద్దు తర్వాత 72 శాతం పెరిగి..

2016లో ప్రధాని మోడీ నోట్ల రద్దు ప్రకటించే నాటికి దేశంలో జనం దగ్గర రూ.17.97 లక్షల కోట్లు ఉన్నాయి. వాటిని నోట్ల రద్దు ద్వారా బ్యాంకుల్లో జమ చేసేలా చేశారు. ఆ తర్వాత మళ్లీ కొత్త నోట్లను విడుదల చేశారు. ఇప్పుడు ఆ డబ్బు క్రమంగా పెరుగుతూ అది 30.88 లక్షల కోట్లకు చేరుకున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇది నోట్ల రద్దుకు ముందు ఉన్న డబ్బుతో పోలిస్తే ఏకంగా 72 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.

 జనం దగ్గర డబ్బు పెరుగుదల ఇలా

జనం దగ్గర డబ్బు పెరుగుదల ఇలా

వాస్తవానికి ఆర్ధిక వ్యవస్థ నుంచి రూ.500, రూ.1,000 నోట్లను ఉపసంహరించుకున్న రెండు వారాల తర్వాత, నవంబర్ 25, 2016న నమోదైన రూ.9.11 లక్షల కోట్ల నుంచి ప్రజల వద్ద నగదు చూస్తే ఏకంగా 239 శాతం పెరిగింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం అక్టోబర్ 21, 2020తో ముగిసిన పక్షం రోజుల్లో ప్రజల వద్ద ఉన్న కరెన్సీ దీపావళి సందర్భంగా రూ.25,585 కోట్లు పెరిగింది. ఇది ఏడాది ప్రాతిపదికన చూస్తే 9.3 శాతం లేదా రూ.2.63 లక్షల కోట్లు పెరిగినట్లయింది. అలాగే నవంబర్ 2016లో ఆర్ధిక వ్యవస్థ నుంచి రూ.500 మరియు రూ.1,000 నోట్లను ఉపసంహరించుకున్న తర్వాత.. నవంబర్ 4, 2016న రూ.17.97 లక్షల కోట్లుగా ఉన్న ప్రజల వద్ద ఉన్న కరెన్సీ, నోట్ల రద్దు తర్వాత 2017 జనవరిలో రూ.7.8 లక్షల కోట్లకు తగ్గింది. ఆ తర్వాత పెరుగుతూ వచ్చింది.

 కరెన్సీ పెరుగుదల వెనుక కరోనా ?

కరెన్సీ పెరుగుదల వెనుక కరోనా ?

ఆర్ధిక అంచనాల ప్రకారం దేశంలో చలామణీలో ఉన్న మొత్తం నగదు నుంచి బ్యాంకుల వద్ద ఉన్న నగదు తీసివేస్తే ప్రజల వద్ద ఉన్న కరెన్సీ ఎంతో తెలుస్తుంది. ఇది వినియోగదారులు, వ్యాపార లావాదేవీల నిర్వహణకు భౌతికంగా వాడే నగదు అన్నమాట. అలాగే కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ నోట్ల రద్దు తర్వాత నగదు రహిత చెల్లింపుల్ని ప్రోత్సహించి పరిమితులు విధించినా వ్యవస్థలో నగదు మాత్రం క్రమంగా పెరుగుతూ వచ్చింది. అయితే మధ్యలో కోవిడ్ కారణంగా జనం వైఖరిలో వచ్చిన మార్పు ఇందుకు దోహదం చేసినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు తమ దగ్గర భారీగా నగదు పోగు చేసుకోవడంతో ఇలా నగదు పెరుగుతూ వచ్చింది.

English summary
cash with public touches record high at rs.30.88 lakh crores now, according to indian express report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X