వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడుకు మృతి: సరోగసి పద్దతిలో ఇద్దరు పిల్లలకు జన్మ

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

కొడుకు మృతి: అయినా సరోగసి పద్దతిలో మనమళ్ళ కు జన్మ

పూణె:కొడుకు చనిపోవడంతో వారసులు లేరని చింతిస్తున్న బాధితులకు ఇద్దరు మగ కవలల రూపంలో కొడుకు చనిపోయిన బాధ దూరమైంది.ఇద్దరు మనమళ్ళలో తమ కొడుకును చూసుకొంటామని ఆ తల్లిదండ్రులు ఆనంద పడుతున్నారు.కొడుకు మరణించిన అతడి ద్వారా పుట్టిన వారసుల్లో కొడుకును చూసుకొంటానని ఆ తల్లి ఆనంద పడుతోంది. ఈ ఘటన మహరాష్ట్రలో చోటు చేసుకొంది.

మహరాష్ట్రలోని పూణెకు చెందిన ప్రథమేష్ పాటిల్ ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్ళాడు. 2013లో ఆరోగ్య సమస్యల కారణంగా పరీక్షలు చేయించుకొన్నాడు. అయితే అతడికి బ్రెయిన్ క్యాన్సర్ ఉందని తేలింది. కీమోథెరపీ చికిత్సను తీసుకోవాలని పాటిల్‌కు సూచించారు.

కీమోథెరపీ కారణంగా సంతానోత్పత్తి సామర్థ్యం కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు ప్రథమేష్‌ పాటిల్‌కు చెప్పారు. కీమోథెరపీకి ముందే ప్రథమేష్ పాటిల్ అనుమతితో అతడి వీర్యం శాంపిళ్ళను తీసి భద్రపర్చారు.

బ్రెయిన్ క్యాన్సర్ ‌తో మృత్యువాత పడ్డ ప్రథమేష్

బ్రెయిన్ క్యాన్సర్ ‌తో మృత్యువాత పడ్డ ప్రథమేష్

కీమో థెరపీ కారణంగా క్యాన్సర్ వ్యాధి కొంత తగ్గినట్టు కన్పించింది. అయితే వ్యాధి నుండి పాటిల్ కోలుకొంటున్నాడని కుటుంబసభ్యులు భావించారు. కానీ, క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టింది. 2016లో ప్రథమేష్ మరణించాడు. మరణించే సమయానికి ప్రథమేష్‌కు వివాహం కాలేదు. కొడుకు చనిపోయాడు. వారసులు లేరని తల్లి రాజ్‌శ్రీ పాటిల్ తీవ్ర మనోవేదనకు గురైంది.

కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి ఏం చేసిందంటే

కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి ఏం చేసిందంటే

ప్రథమేష్ పాటిల్ మరణాన్ని తల్లి రాజ్‌శ్రీ పాటిల్ తట్టుకోలేదు. దీంతో పాటిల్ వీర్యాన్ని జర్మనీలో భద్రపర్చిన విషయాన్ని గుర్తుకు వచ్చింది. దీంతో ఆమె పూణెలోని సహ్యాద్రి ఆసుపత్రి వైద్యులను సంప్రదించి తన భాదను వివరించింది. సహ్యద్రి ఆసుపత్రి వైద్యులు జర్మనీ నుండి ప్రథమేష్ వీర్యాన్ని పూణెకు తెప్పించారు.

నాలుగు పిండాలను రూపొందించారు

నాలుగు పిండాలను రూపొందించారు

ప్రథమేష్ కుటుంబంలో ఓ మహిళ నుండి అండాలను సేకరించి, ప్రథమేష్ వీర్యంతో నాలుగు పిండాలను రూపొందించారు. అయితే ఈ పిండాలను తన గర్భంలో ఉంచుకోవడానికి ప్రథమేష్ తల్లి రాజ్‌శ్రీ ముందుకు వచ్చింది. అయితే అప్పటికే ఆమె వయస్సు 49 ఏళ్ళు. అయితే ఆమెకు వయస్సు సహకరించిందని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో ప్రథమేష్ సోదరి గర్భంలో రెండు పిండాలను గత ఏడాది మే మాసంలో ప్రవేశపెట్టారు.

సరోగసీ పద్దతిలో కవలలకు జన్మ

సరోగసీ పద్దతిలో కవలలకు జన్మ

సరోగసీ పద్దతిలో ప్రథమేష్ సోదరి ఫిబ్రవరి 12వ, తేదిన ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చింది. దీంతో ప్రథమేష్ పాటిల్ తల్లి దండ్రులు ఆనందం పట్టలేకపోతున్నారు. ప్రథమేష్ పాటిల్ లేని లోటును మనమళ్ళ ద్వారా తీర్చుకొనే అవకాశం ఉంటుందంటున్నారు.ఈ పద్దతిలో పిల్లల్ని కనడం తొలిసారి కాదని ఇండియన్ సరోగసీ లా సెంటర్ వ్యవస్థాపకుడు హరిరామసుబ్రమణియన్ చెప్పారు.

English summary
The parents of a 27-year-old man, who died of a brain tumour in 2016, used his cryopreserved semen to have grandchildren through a surrogate pregnancy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X