రిషీ సునాక్ ఎన్నికతో భారత్ లో కొత్త చర్చ-మైనార్టీ ప్రధాని కాగలడా ? విపక్షాల ప్రశ్న-బీజేపీ కౌంటర్
భారత్ కు స్వాతంత్రం ఇచ్చిన 75 ఏళ్లకు బ్రిటన్ ప్రధానిగా భారత మూలాలున్న రిషీ సునాక్ ను ఎన్నుకున్న బ్రిటన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అదే సమయంలో భారత్ లో మాత్రం వింత చర్చ జరుగుతోంది. బ్రిటన్ లో మైనార్టీ అయిన రిషీ సునాక్ అక్కడ ప్రధాని కాగలిగారని.. కానీ భారత్ లో ఓ మైనార్టీ ప్రధాని కాగలడా అనే ప్రశ్న విపక్షాలు సంధిస్తున్నాయి.దీనికి బీజేపీ కూడా ఘాటుగానే కౌంటర్లు ఇస్తోంది.

బ్రిటన్ ప్రధానిగా రిషీ సునాక్
బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషీ సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేశం ఆర్ధిక తిరోగమనం వైపు నడుస్తున్న వేళ బ్రిటన్ లో కన్జర్వేటివ్ పార్టీ సభ్యులంతా భవిష్యత్తు కోసం అన్నింటినీ పక్కనబెట్టి మైనార్టీ అయిన, భారతీయ మూలాలున్న మాజీ ఆర్ధిక మంత్రి రిషీ సునాక్ కు ప్రధాని పగ్గాలు అప్పగించారు. దీంతో ఆయన ఇవాళ ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్దమవుతున్నారు. బ్రిటన్ కు ప్రధాని అవుతున్న తొలి హిందువు, తొలి భారతీయ మూలాలున్నవ్యక్తి కూడా రిషీ సునాకే. దీంతో రిషీ సునాక్ ఎన్నిక పలు విధాలుగా భారత్ కు ప్రాధాన్యంగా మారింది.
భారత్ లో సాధ్యమేనా అని విపక్షాల ప్రశ్న
ఓ మైనార్టీ హిందువు అయిన రిషీసునాక్ ను బ్రిటన్ అన్నీ వదిలిపెట్టి ప్రధానిగా ఎన్నుకోవడంతో భారత్ లో ఇప్పుడు ఈ విషయంలో రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతోంది. భారత్ ఇలా ఓ మైనార్టీకి ప్రధాని పదవి ఇవ్వగలదా అన్న చర్చ మొదలైంది.కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడి ఓడిపోయిన ఎంపీ శశిథరూర్ ఇప్పుడు ఈ వాదనను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్, పీడీపీ కూడా ఇప్పుడు ఇదే వాదనను సమర్ధిస్తూ బీజేపీకి ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఓ ముస్లిం, దళిత, సిక్కు లేదా మరే మైనార్టీకి అయినా ప్రధాని పదవి ఇక్కడ సాధ్యమేనా అంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు వేస్తున్న ప్రశ్నపై చర్చ జరుగుతోంది.
కశ్మీర్లో సీఎం చేయమని బీజేపీ కౌంటర్
భారత్ లో ఓ మైనార్టీని ప్రధాని చేయగలరా అంటూ బీజేపీకి విపక్ష పార్టీలైన కాంగ్రెస్, పీడీపీ వంటి పార్టీలు వేస్తున్న ప్రశ్నకు కాషాయ శిబిరం ఘాటుగానే బదులిస్తోంది. ముందు కశ్మీర్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో మైనార్టీలకు సీఎం పదవులు ఇవ్వడంటూ కాంగ్రెస్ కు బీజేపీ కౌంటర్లు వేస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ చేసిన మైనార్టీ ప్రధాని డిమాండ్ పై స్పందిస్తూ బీజేపీ నేత అమిత్ మాలవీయ .. వారిపై అంత ప్రేమ ఉంటే మమత సీఎం పదవి వదులుకుని పార్టీ నేత ఫిర్హద్ హకీమ్ ను బెంగాల్ సీఎం చేయమని సలహా ఇచ్చారు.
సరికాదన్న మార్కండేయ కట్జూ
భారత్ లో మైనార్టీ ప్రధాని కాగలడా అంటూ విపక్షాలు లేవనెత్తిన డిమాండ్ పై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ ఫైర్ అయ్యారు. భారత్ లో 90 శాతం మంది మూర్ఖులున్నారని గతంలో తాను చెప్పానని, రిషీ సునాక్ బ్రిటీష్ ప్రధాని అయితే సంబరాలు చేసుకోవడమేంటని ఆయన ప్రశ్నించారు. బ్రిటన్ ప్రధాని స్ధానికుడా, భారతీయుడా, చైనా వాడా అన్నది అప్రస్తుతమని, ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ఆయన ఎలా ఎదుర్కొని పరిష్కారం చూపిస్తాడన్నది చూడాలన్నారు. భారత్ లో మైనార్టీ ప్రధాని డిమాండ్ చేయడం కూడా సరికాదన్నారు.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications