వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తర్ ప్రదేశ్ లో తండ్రికొడుకుల వార్ :సిట్టింగ్ లకు నో చాన్స్

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో తన మద్దతుదారులకు టిక్కెట్లు దక్కకపోవడంతో సిఎం అఖిలేష్ యాదవ్ ఆగ్రహంతో ఉన్నారు. తన మద్దతుదారులతో సమావేశమై రెబెల్ గా బరిలోకి దిగేందుకు అఖిలేష్ సన్నాహాలు చేస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో :ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీలో సమస్యలు రోజురోజుకు తీవ్రమౌతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మద్దతుదారులకు టిక్కెట్లు కేటాయించలేదు .అయితే తన మద్దతుదారులతో రెబెల్ గా బరిలోకి దిగాలని అఖిలేష్ యాదవ్ అస్త్రాన్ని సంధించనున్నారు.

సమాజ్ వాదీ పార్టీలో అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అయితే 403 మందితో అఖిలేష్ పంపిన జాబితాలో పేర్లను పక్కకు పెట్టారు. అఖిలేష్ వ్యతిరేకులే జాబితాలో టిక్కెట్లు కేటాయించారు.

టిక్కెట్ల కేటాయింపులో శివపాల్ యాదవ్ చెప్పిన వ్యక్తులకే టిక్కెట్లను కేటాయించారు. ములాయం సింగ్ కూడ శివపాల్ చెప్పినట్టుగానే టిక్కెట్లు కేటాయించారు.అయితే ఈ టిక్కెట్ల కేటాయింపు జాబితాపై అఖిలేష్ గుర్రుగా ఉన్నారు.

త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.అయితే షెడ్యూల్ విడుదలయ్యే నాటికి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది సమాజ్ వాాదీ పార్టీ.అయితే సుమారు 70 కి పైగా అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మాత్రం ప్రకటించాల్సి ఉంది.

తన మద్దతుదారులతో రెబెల్స్ గా అఖిలేష్ అస్త్రం

తన మద్దతుదారులతో రెబెల్స్ గా అఖిలేష్ అస్త్రం

పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో అఖిలేష్ మద్దతుదారులకు టిక్కెట్లు దక్కలేదు. తన మద్దతుదారులకు టిక్కెట్లు కేటాయించాలని కోరుతూ 403 మంది జాబితాతో అఖిలేష్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ కు లేఖ పంపాడు.అయితే అఖిలేష్ పంపిన జాబితాలో ఒక్కరిద్దరూ మినహ మిగిలినవారెవ్వరికీ కూడ టిక్కెట్లు కేటాయించలేదు.శివపాల్ సూచించినవారికే ములాయం టిక్కెట్లను కట్టబెట్టాడు.దింతో ఆగ్రహంతో ఉన్న అఖిలేష్ తన మద్దతుదారులతో రెబెల్ గా పోటీచేసేందుకు సన్నాహాలు చేసుకొంటున్నాడు.

సిట్టింగ్ లకు నో చాన్స్

సిట్టింగ్ లకు నో చాన్స్

ఈ అసెంబ్లీలో ఎంఏల్ఏ గా ఉన్నవారికే సమాజ్ వాదీ పార్టీ టిక్కెట్లను కేటాయించలేదు. సిట్టింగ్ లను విస్మరిచి కొత్త వారికి టిక్కెట్లను కట్టబెట్టింది. సిట్టింగ్ ఎంఏల్ఏలు అంతా ఎక్కువగా అఖిలేష్ మద్దతుదారులే. అఖిలేష్ యాదవ్ తన మద్దతుదారులైన ఎంఏల్ఏలతో అఖిలేష్ సమావేశమై పార్టీ టిక్కెట్లు దక్కని ఎంఏల్ఏలంతా రెబెల్ గా బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకొన్నారు. శివపాల్ చక్రం తిప్పి పార్టీలో అఖిలేష్ కు చెక్ పెట్టేందుకు పథకం ప్రకారం వ్యవహరించారు.

ప్రచారంలో ఉండగానే అభ్యర్థుల జాబితా

ప్రచారంలో ఉండగానే అభ్యర్థుల జాబితా

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అఖిలేష్ బిజీ బిజీగా ఉన్నారు. బుందేల్ ఖండ్ లోని రెండు అసెంబ్లీ స్థానాల నుండి ఆయన పోటీ చేయనున్నారు.అయితే బుందేల్ ఖండ్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో అఖిలేష్ ఉన్న సమయంలోనే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను సమాజ్ వాదీ పార్టీ ప్రకటించింది. సమాజ్ వాదీ పార్టీ 325 అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మరో 78 కి పైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.ఈ జాబితాను బుదవారం నాడు ములాయం, శివపాల్ యాదవ్ లు ప్రకటించారు.

78 స్ఘానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది

78 స్ఘానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది

కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని సమాజ్ వాదీ పార్టీ భావిస్తోంది. ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే ఉత్తర్ ప్రదేశ్ లో మంచి ఫలితాలు వస్తాయని యూపి సిఎం అఖిలేష్ యాదవ్ చెప్పారు. అయితే సమాజ్ వాదీ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వం మాత్రం ససేమిరా అంటోంది. అయితే సమాజ్ వాదీ పార్టీ 78 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించకపోవడం కూడ కాంగ్రెస్ పార్టతో పొత్తు ఉంటుందనే ప్రచారం కూడ మళ్ళీ ప్రారంభమైంది.అయితే ఎస్ పి లో నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఆ పార్టీ విజయావకాశాలపై ఈ ప్రభావం ఉండే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకుులు అభిప్రాయపడుతున్నారు.

సిఎం అభ్యర్థి ఎవరనేది ఎన్నికల తర్వాతే

సిఎం అభ్యర్థి ఎవరనేది ఎన్నికల తర్వాతే

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను తానే ఎంపిక చేసినట్టుగా సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్ ప్రకటించారు. చాలా మంది జాబితాలను పంపుతారు.అయితే పార్టీ అవసరాలనుబట్టి ఎవరిని ఎంపిక చేయాలనేది తన నిర్ణయమని ములాయం ప్రకటించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇప్పటికిప్పుడే ప్రకటించమని ఆయన చెప్పారు. సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఎంఏల్ఏలు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్రుకొంటారని ములాయం చెప్పారు.ఎక్కడి నుండి పోటీచేయాలనుకొంటే అక్కడి నుండి అఖిలేష్ పోటీచేయవచ్చని ములాయం తేల్చిచెప్పారు.

English summary
akhilesh yadav was away in bundelkhand yesterday when mulayam singh announced 325 candidates, leaving out several key aides of his son. candidates recommended by his brother Shivpal Yadav made the cut. both akhilesh and shivpal had recommended different people for most seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X