నితీష్ రిజైన్ వ్యూహం, ఒక్క మోడీకోసం ప్రత్యర్థులు ఏకం

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జెడియు ముఖ్యనేత నితీష్ కుమార్ రాజీనామాను రాష్ట్ర గవర్నర్ ఆమోదించిన విషయం తెలిసిందే. మోడీ హవాకు రాష్ట్రంలో లోకసభ ఎన్నికల్లో పార్టీ తుడిచి పెట్టుకు పోయిన నేపథ్యంలో నితీష్ శనివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా వ్యూహాత్మకమని చెబుతున్నారు.

ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయంపాలు కావడంతో పాటు, అసమ్మతి భగ్గుమనడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నితీష్ వ్యూహాత్మకంగా రాజీనామా చేశారని అంటున్నారు.

After Nitish’s resignation, JD(U) tries to woo Lalu Prasad for ‘secular alliance’ in Bihar

శుక్రవారం ఎన్నికల ఫళితాలు వెలువడుతుండగానే బిజెపి బీహార్ నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి... జెడియు ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ నితీష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయన తనంతట తానుగా రాజీనామా చేయకపోయినా మైనార్టీ అంచున ఉన్న ప్రభుత్వం కొద్దిరోజుల్లోనే పడిపోతుందని చెప్పారు. జెడియుకు చెందిన దాదాపు అరవై మంది శాసన సభ్యులు తమతో చర్చలు జరుపుతున్నారని చెప్పారు. నితీష్ తీరుపై అసంతృప్తితో ఉన్న వారు ఎప్పుడైనా తమ పార్టీలోకి వస్తారని చెప్పారు. ఈ పరిణామాలు గమనించే నితీష్ రాజీనామా చేశారని భావిస్తున్నారు.

కొత్త సిఎంగా బీజేంద్ర యాదవ్?

నితీష్ కుమార్ రాజీనామా నేపథ్యంలో బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేంద్ర యాదవ్‌ను ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మోడీ టార్గెట్‌గా ప్రత్యర్థులు ఒక్కటి!

దేశవ్యాప్తంగా మోడీ హవా నేపథ్యంలో బిజెపి విజయఢంగా మోగించగా.. పలు రాష్ట్రాల్లో స్థానిక పార్టీలు తుడిచి పెట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో మోడీ లక్ష్యంగా నితీష్ కుమార్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఒక్క మోడీని ఎదుర్కొనేందుకు ఆయా ప్రత్యర్థులు కూడా ఒక్కటయ్యేందుకు సిద్దమవుతున్నారట.

బీహార్లో ఆర్జెడీ, జెడియులు ప్రత్యర్థులు. మోడీ హవాకు ఈ రెండు పార్టీలు బీహార్లో తుడిచి పెట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో లాలూ, నితీష్‌లు సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సెక్యులర్ అలయెన్స్ కోసం చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. మరోవైపు బీహార్‌లో తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా జెడియు అధినేత శరద్ యాదవ్ కాంగ్రెసు పార్టీని కోరినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+