ఇక మార్కెట్లోకి పతంజలి ఖాదీ యోగా వేర్
న్యూఢిల్లీ: ఇటీవలే పతంజలి నూడుల్స్‌ను మార్కెట్లోకి తెచ్చిన యోగా గురువు బాబా రాందేవ్ ఇప్పుడు మరికొన్ని ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ స్పోర్ట్స్ వేర్ దుస్తులు అడిడాస్, నైక్ మాదిరిగానే పతంజలి యోగావేర్ దుస్తులు తయారు చేయనున్నారు.
అలాగే ఆరోగ్య పానీయాలు, సౌందర్య సాధనాలు పతంజలి నుంచి తయారు చేస్తామని బాబా రాందేవ్ తెలిపారు. పవర్ వీటా, హార్లిక్స్, బోర్నవీటా, బేబీ కేర్ ఉత్పత్తులు, సౌందర్య సాధనాలన్నంటికీ పోటీగా పతంజలి ఉత్పత్తులు తీసుకురానున్నారు.

‘వస్త్రం' పేరుతో పతంజలి యోగా వేర్ దుస్తులు ఖాదీతో తయారు చేస్తున్నట్లు బాబా రాందేవ్ తెలిపారు. అనుకూలమైన ధరకే వీటిని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
పతంజలి నూడుల్స్‌కు మంచి డిమాండ్ వస్తోందని ఢిల్లీ ఎన్‌సిఆర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటకల్లో నూడిల్స్ తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా, హర్యానాకు చెందిన రెజ్లర్ సుశీల్ కుమార్ పతంజలి ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారని తెలిపారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications