వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వం నాదే: 10మందితో గవర్నర్‌ను కలిసిన శశికళ

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ గురువారం రాత్రి ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావును కలిశారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ గురువారం రాత్రి ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావును కలిశారు. 130 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని చెప్పిన ఆమె 8 మంది మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలతో ఆయనను కలిశారు.

ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనకు అనుమతివ్వాలని కోరారు. అరగంటపాటు గవర్నర్‌తో భేటీ అయ్యారు. గవర్నర్‌తో భేటీ అనంతరం శశికళ ఉత్సాహంగా కనిపించడానికి ప్రయత్నించారు.

sasikala

తనకు ఉన్న సంఖ్యా బలాన్ని, శాసన సభా పక్ష నేతగా ఎన్నికైన విషయాన్ని శశికళ గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లారు. శశికళ అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా ఎన్నికయిన అనంతరం.. ముఖ్యమంత్రి పదవి చేపట్టే ముందు పన్నీరు సెల్వం రివర్స్ అయ్యారు.

శశికళ గవర్నర్‌ను కలిసే ముందు చెన్నైలోని మెరీనా బీచ్ తీరంలో దివంగత జయలలిత సమాధి వద్ద పుష్పగుచ్ఛంతో నివాళులు అర్పించారు. అక్కడి నుంచి రాజ్ భవన్ చేరుకున్నారు. జయ సమాధి వద్ద భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.

English summary
After Panneerselvam, AIADMK chief Sasikala Meets Governor With Ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X