• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కశ్మీర్‌పై రాహుల్‌వి తప్పుడు కథనాలు : కొట్టిపారేసిన రాజ్‌భవన్, వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్

|

శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లో పర్యటనపై ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలను ఆ రాష్ట్ర గవర్నర్ కార్యాలయం తప్పుపట్టింది. కశ్మీర్‌లో పరిస్థితి మెరుగ్గా ఉంటే తప్పుడు వార్తలు ఎందుకు వల్లిస్తారని మందలించింది. ఈ మేరకు జమ్ముకశ్మీర్ రాజ్‌భవన్ ఒక నోట్ విడుదల చేసింది. అందులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్లను ప్రస్తావించి మందలించింది.

వ్యాఖ్యలు వెనక్కి తీసుకొండి

వ్యాఖ్యలు వెనక్కి తీసుకొండి

ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌లో పరిస్థితి బాగోలేదని రాహుల్ ట్వీట్ చేయడంతో కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పందించిన సంగతి తెలిసిందే. కానీ ఓ తప్పుడు వార్తను రాహల్ గాంధీ ఫాలో అయ్యారని గవర్నర్ కార్యాలయ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొందని ఆయన వివరించారు. ఆ వ్యాఖ్యలను రాహుల్ సవరించుకోవాలని సూచించింది. లేదంటే కశ్మీర్ పరిస్థితుల గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని సుప్రీంకోర్టులో కేసు వేస్తామని హెచ్చరించింది. అంతేకాదు కశ్మీర్ అంశానికి సంబంధించి పేపర్ లేదంటే న్యూస్ చానెల్‌లో చూడాలని సూచించారు. అంతేకాదు విదేశీ మీడియా కూడా కశ్మీర్‌లో అశాంతి ఉందని ప్రచారం చేయలేదని గుర్తుచేశారు. ఈ నెల 11న పరిస్థితి బాగో లేదని రాహుల్ ప్రస్తావించారని .. అదేం లేదని తేల్చిచెప్పారు. తప్పుడు కథనాలతో ప్రజల్లో అశాంతిని రేపొద్దని సూచించారు.

ఏం జరిగిందంటే ..

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు పరిస్థితి ఏం బాగోలేదనే ప్రచారం జరిగింది. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ స్పందించారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయమని మండిపడ్డారు. శ్రీనగర్ రహదారులపైకి 10 వేల మంది కశ్మీరీలు వచ్చి ఆందోళన చేశారనే వార్తలొచ్చాయి. దీంతో ప్రస్తుత పరిస్థితిపై రాహుల్ ట్వీట్ చేశారు. దీనిపై గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పందిస్తూ కశ్మీర్‌ రావాలని.. ఒక విమానం కూడా పంపిస్తానని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి రాహుల్ గాంధీ ప్రతిస్పందించారు. 'అఖిలపక్ష నేతలు, తనను కశ్మీర్‌ పరిస్థితులను పరిశీలించేందుకు పిలిచిన గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు ధన్యవాదాలు. జమ్ముకశ్మీర్, లడఖ్ పర్యటిస్తామన్నారు. కానీ తమ బృందానికి హెలికాప్టర్ ఆరెంజ్ చేయనవసరం లేదన్నారు. కశ్మీర్‌లో సాధారణంగా ప్రయాణించి .. అక్కడి ప్రజలను కలుసుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. తాను, మిగతా నేతలు కూడా కశ్మీర్ వచ్చేందుకు సిద్ధం‘ అని రాహుల్ రీ ట్వీట్ చేశారు.

ట్వీట్ వార్ ..

రాహుల్ ప్రారంభించిన ట్వీట్ వార్ .. చిలికి చిలికి గాలివానలా మారింది. ఆర్టికల్ 370 రద్దుతో వ్యాలీలో పరిస్థితికి కారణమని రాహుల్ ఆరోపించగా .. సత్యపాల్ మాలిక్ తప్పుపట్టారు. మీరు బాధ్యతయుత గల నేత, ఇలా మాట్లాడటం సరికాదన్నారు. కావాలంటే స్వయంగా పరిస్థితిని చూసేందుకు కశ్మీర్ రావాలని ఆహ్వానం పలికారు. విమానం కూడా పంపిస్తామని పేర్కొన్నారు. దీనికి కాంగ్రెస్ నేత శశిథరూర్ స్పందిస్తూ .. రాహుల్ ఒక్కరే ఎందుకు .. అఖిలపక్ష నేతలను కూడా పిలువాలని కోరారు. ఇందుకు మాలిక్ సమ్మతించి .. రాహుల్‌.. మిగతా అఖిలపక్ష నేతలు కశ్మీర్ రావాలని కోరారు. అయితే ఇందుకు రాహుల్ కండీషన్స్ పెడుతూ ట్వీట్ చేయడంతో ట్విట్ట యుద్ధం కొనసాగుతుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jammu and Kashmir Governor's office has chided Congress leader Rahul Gandhi for spreading fake news regarding the situation in the state. On Tuesday, the J&K Raj Bhawan issued a clarification regarding Rahul Gandhi's allegation that unrest had been reported in parts of Jammu and Kashmir after the government abrogated Article 370. A Raj Bhawan spokesperson said, "Rahul Gandhi was responding to fake news possibly spread from across the border about the situation in Kashmir, which is peaceful with negligible incidents."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more