కేజ్రీవాల్‌కు మరో చిక్కు: ఎమ్మెల్యేకు ఫేక్ డిగ్రీ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత జితేంద్ర సింగ్ తోమర్ అరెస్టు అనంతరం ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. ఏఏపీ నేత, ఢిల్లీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సురేందర్ సింగ్ పైన ఫేక్ డిగ్రీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మే 20వ తేదీన ఢిల్లీ హైకోర్టు సురేందర్ సింగ్‌కు ఫేక్ డిగ్రీ అంశంలో నోటీసులు పంపించింది.
భారతీయ జనతా పార్టీ నేత కరణ్ సింగ్ తన్వార్ ఢిల్లీ హైకోర్టులో దీని పైన పిటిషన్ దాఖలు చేశారు. తన్వర్ చెప్పిన వివరాల మేరకు.. సురేందర్ సింగ్ తన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారు. తాను 2012లో సిక్కిం విశ్వవిద్యాలయం నుండి బీఏ చేసినట్లు పేర్కొన్నారని చెప్పారు.

అయితే, సిక్కిం విశ్వవిద్యాలయం దీనిని కొట్టిపారేసింది. బీజేపీ నేత కోర్టుకు వెళ్లడంతో నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు నాలుగు రోజుల సమయం ఇచ్చింది. తదుపరి విచారణ జూలైలో ఉంది.
మరోవైపు, తన వద్ద బీఏకి చెందిన అన్ని సర్టిఫికేట్లు ఉన్నాయని సురేందర్ సింగ్ చెప్పారు. తన పైన పిటిషన్ రాజకీయ ఉద్దేశ్యంతో కూడుకున్నదని చెప్పారు.












Click it and Unblock the Notifications