రెండేళ్ల క్రితం పెళ్లి, బిడ్డకు ఏడాది వయసు, భర్త బయటకు వెళ్లాడు, ఇంట్లో ఏం జరిగిందంటే !
పెళ్లి వయసుకు వచ్చిన యువతికి వివాహం చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూశారు. సిటీలో ఉద్యోగం చేస్తున్న యువకుడితో అమ్మాయి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు చర్చలు జరిపారు. వివాహం చేసుకోవడానికి యువతి ఓకే చెప్పింది అయితే బిడ్డ పుట్టిన కొన్ని నెలలకే మహిళ ఇంట్లో శవమై కనిపించడంతో అందరూ హడలిపోయారు.
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని కుణిగల్ లో కావ్య (23) అనే యువతి నివాసం ఉండేది. కావ్యకు పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూశారు. చాలా పెళ్లి సంబంధాలు చూసినా కావ్యకు ఎక్కడా పెళ్లి సెట్ కాలేదు. బెంగళూరులోని రాజగోపాల నగరలోని మోహన్ సినిమా థియేటర్ సమీపంలోని నివాసం ఉ:టున్న ప్రవీణ్ అనే యువకుడికి, కావ్యకు పెళ్లి సెట్ అయ్యింది.

రెండు సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు, బందువులు, స్నేహితుల సమక్షంలో కావ్య, ప్రవీణ్ ల పెళ్లి గ్రాండ్ గా జరిగింది. రాజగోపాల్ నగరలోని మోహన్ థియేటర్ సమీపంలోే కావ్య, ప్రవీణ్ దంపతులు కాపురం ఉన్నారు. వివాహం చేసుకున్న తరువాత కావ్య, ప్రవీణ్ దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో బిడ్డ పట్టింది. బిడ్డకు ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు.
ఆదివారం ప్రవీణ్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడని తెలిసింది. ఆ సందర్బంలో బిడ్డతో పాటు కావ్య ఇంట్లోనే ఉందని తెలిసింది. తాను పని ముగించుకుని ఇంటికి వచ్చి చూడగా తన భార్య కావ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ప్రవీణ్ పోలీసులకు, భార్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం తెలుసుకున్న రాజగోపాల్ నగర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.

కావ్య ఆత్మహత్య చేసుకునే ముందు ఎలాంటి డెత్ నోట్ రాయపోవడంతో అనేక అనుమానాలు ఉన్నాయని ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కావ్య భర్త ప్రవీణ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు అన్నారు. వివాహం చేసుకున్న రెండు ఏళ్లకే కావ్య శవమై కనిపించడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications