వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుల నిరసనలపై పిక్కీ సదస్సులో స్పందించిన మోడీ- సంస్కరణలు తప్పవని సంకేతం

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వ్యవసాయ చట్టాల్లో రైతుల అభ్యంతరాల మేరకు సవరణలు చేసేందుకు కేంద్రం సిద్దమైనా వాటిని పూర్తిగా వెనక్కి తీసుకోవాల్సిందేనని అన్నదాతలు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ చట్టాలపై ప్రధాని మోడీ ఇవాళ స్పందించారు.

ఢిల్లీలో జరుగుతున్న ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్ ఆఫ్‌ కామర్స్‌ (ఫిక్కీ) 93వ వార్షిక సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ... దేశంలో వ్యవసాయ సంస్కరణల ఆవశ్యకతను గుర్తుచేశారు. ప్రస్తుతం దేశంలో రైతులు తమ ఉత్పత్తులను స్ధానిక మండీలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ అమ్ముకుంటున్నారని ప్రధాని తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాల వల్ల డిజిటల్ విధానంలోనూ వాటిని అమ్ముకునేందుకు వీలు కలుగుతుందన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచి వారిని ధనికులుగా మార్చేందుకే తాము ఈ చర్యలు తీసుకుటుంటున్నట్లు ప్రధాని తెలిపారు.

Agri Reforms Will Create New Markets, Increase Farmers income Says PM Modi

Recommended Video

నూతన చట్టాలు రైతులకు మేలు చేసేవే-ప్రధాని మోడీ

ప్రస్తుతం దేశంలో కార్పోరేట్‌ పన్ను ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే చాలా సమంజసంగా ఉందని ప్రధాని మోడీ తెలిపారు. కానీ దీని మదింపు మాత్రం సంపూర్ణంగా లేదన్నారు. దేశంలో ఓ రంగం బాగా అభివృద్ధి చెందితే దాని ప్రభావం సహజంగానే ఇతర రంగాలపై ఉంటుందని మోడీ తెలిపారు. తద్వారా వ్యవసాయ రంగంలో సంస్కరణలు అవసరమన్న విషయాన్ని మోడీ మరోసారి సమర్ధించారు.
దేశవ్యాప్తంగా రైతులు ఆందోలనలు కొనసాగుతుండగా..ప్రస్తుతం వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్నారు.

English summary
The new agri laws will bring down barriers between agricultural and associated sectors, creating new markets for the farmers who will gain from technological advances, Prime Minister Narendra Modi said on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X