వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుణె రియల్టర్ నుంచి హెలికాప్టర్ స్వాధీనం..

|
Google Oneindia TeluguNews

రూ.34 వేల కోట్ల విలువైన దివాన్ హౌసింగ్ ఫైనాన్సింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ స్కాంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. పుణేలో నిందితుడు, ప్రాపర్టీ బిల్డర్ అవినాష్ భోసాలేకు చెందిన ఓ ప్రాంగణంలోనూ సీబీఐ అధికారులు తనిఖీ చేపట్టారు. అక్కడ హ్యాంగర్ తరహాలో నిర్మితమైన పెద్ద హాలులో నిలిపివున్న ఓ అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్‌ను చూసి అధికారులు ఆశ్చర్యపోయారు.

 AgustaWestland chopper seized from Pune realtor

ఆ హాలులో అన్నీ పాప్ సంగీతానికి సంబంధించి పోస్టర్లు ఉన్నాయి. బ్యాంకు ఫ్రాడ్ కేసులో సీబీఐ ఇప్పటికే డీహెచ్ఎఫ్ఎల్ ఉన్నతాధికారులు కపిల్ వాధ్వాన్, దీపక్ వాధ్వాన్ తదితరులపై సీబీఐ చార్జిషీట్లు నమోదు చేసింది. 17 బ్యాంకులతో కూడిన కన్సార్టియంను వారు మోసగించి రూ.34,615 కోట్ల మేర రుణాలను దారిమళ్లించారని ఆరోపణలు వచ్చాయి.

వారు పలు షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారు. సమాంతర ఆడిట్ వ్యవస్థను కూడా సిద్ధం చేసినట్టు వెల్లడైంది. లేని వ్యక్తులకు నకిలీ లోన్లు ఇవ్వడం ద్వారా డీహెచ్ఎఫ్ఎల్‌లోని పబ్లిక్ ఫండ్స్ కాజేసేందుకు పథకరచన చేసినట్టు గుర్తించారు. వారి పన్నగాన్ని ఆదిలోనే బ్రేకులు వేశారు.

English summary
CBI has seized an AgustaWestland helicopter from the premises of builder Avinash Bhosale in Pune in connection with the Rs 34,615 crore bank fraud case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X