ప్రధానిగా మోడీ ప్రమాణం, ఆయన జట్టు ఇదే
న్యూఢిల్లీ: సోమవారం సాయంత్రం ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన హిందీలో ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. ఆయన మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణం చేశారు. నరేంద్ర మోడీ సోమవారం ఉదయం రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. రాష్ట్రపతి భవన్ వద్ద మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ ఏర్పాట్లు జరిగాయి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని ఆయన కలుసుకున్నారు.
సుదర్శన్ భగత్ సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన లోహర్‌దగ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. తొలిసారి ఆయన లోకసభకు ఎన్నికయ్యారు.

విష్ణుదేవ్ సాయి సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన రాయఘడ్ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. రెండు సార్లు లోకసభకు ఎన్నికయ్యారు.
రావ్ సాహెబ్ సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు.
వాసవ మన్సూర్ భాయ్ సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన బారుచీ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు.
సంజీవ్ కుమార్ సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. ముజఫర్ నగర్ నుంచి ఆయన లోకసభకు ఎన్నికయ్యారు.
క్రిషన్ పాల్ గుజర్ సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన ఫరీదాబాద్ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు.
కిరెన్ రిజిజు సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన అరుణాచల్ పశ్చిమం నుంచి లోకసభకు ఎన్నికయ్యారు.

సిపి రాధాకృష్ణన్ సహాయ మంత్రిగా ప్రమాణఁ చేశారు. ఆయన కోయంబత్తూర్ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. తమిళనాడు బిజెపి అధ్యక్షుడిగా ఉన్నారు.
ఉపేంద్ర కుష్వాహా సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. కరకట్ నుంచి లోకసభకు ఎన్నిరయ్యారు.
నిహాల్ సింగ్ సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు.
మనోజ్ సిన్హా సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. గాజీపూర్ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు
గౌదర్ మల్లికార్జున సిద్ధేశ్వర సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. దావణగెరే స్థానం నుంచి లోకసభకు ఎన్నికయ్యారు.
పది మంది స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.

నిర్మలా సీతారామన్ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బిజెపి అధికార ప్రతినిదధి. జాతీయ మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు
జితేంద్ర సింగ్ సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన జమ్మూ కాశ్మీర్‌లోని ఉదంపూర్ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు.
రాజ్యసభ సభ్యుడు పియూష్ గోయల్ సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు.
రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ జవదేకర్ సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన బిజెపి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. గతంలో రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.
శర్వానంద్ సానోవాల్ సహాయ మంత్రులుగా పనిచేశారు. ఆయన అసోంలోని అబీమ్‌పూర్ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు.
రాజ్యసభ సభ్యుడు ధర్మేంద్ర ప్రధాన్ సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. రెండు సార్లు లోకసభకు ఎన్నికయ్యారు. బిజెపి యువమోర్చాలో కీలక పాత్ర పోషించారు.

శ్రీపాద్ నాయక్ సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. ఉత్తర గోవా నుంచి లోకసభకు ఎన్నికయ్యారు.
సంతోష్ గ్యాంగ్‌వర్ సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన బరేలీ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. ఏడు సార్లు లోకసభకు ఎన్నికయ్యారు.
రావ్ ఇంద్రజిత్ సహాయ మంత్రి (స్వతంత్ర)గా ప్రమాణం స్వీకారం చేశారు. ఆయన గురుగావ్ నుంచి లోకసభకు ఎన్నియ్యారు. నాలుగు సార్లు లోకసభకు ఎన్నికయ్యారు.
వికె సింగ్ సహాయ మంత్రి (స్వతంత్ర)గా ప్రమాణం చేశారు. ఆయన ఘజియాబాద్ నుంచి ఎన్నికయ్యారు.
24 మంది క్యాబినెట్ మంత్రులుగా పనిచేశారు.
హర్షవర్ధన్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన చాందినీ చౌక్ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. చిన్నప్పటి నుంచీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త

స్మృతి ఇరానీ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. ఆమె రాహుల్ గాంధీపై ఆమేథీలో పోటీ చేసి ఓడిపోయారు. ఆమె బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఉన్నారు. గతంలో గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
టిసి గెహ్లాట్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాధ మోహన్ సింగ్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన పుర్వి చంపారన్ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. నాలుగు సార్లు లోకసభకు ఎన్నికయ్యారు. బిజెపిలో కీలక బాధ్యతలు నిర్వహించారు.
జ్యూయల్ ఓరమ్ మంత్రిగా ప్రమాణం చేశారు. సుందర్ ఘడ్ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. గతంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. నాలుగు సార్లు లోకసభకు ఎన్నికయ్యారు.
నరేంద్ర సింగ్ తోమర్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన గ్వాలియర్ నుంచి ఎన్నికయ్యారు. అబిమానులు మున్నా భయ్యాగా పిలుచుకుంటారు.

హర్‌స్మిత్ కౌర్ ప్రమాణం చేశారు. ఆమె పంజాబ్‌లోని భటిండా నుంచి ఎన్నికయ్యారు. ఆమె అకాలీదళ్ సభ్యురాలు. మూడు సార్లు లోకసభకు ఎన్నికయ్యారు. సామాజిక ఉద్యమకారిణి
అనంత్ గీతే కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన మహారాష్ట్రలోని రాయిఘడ్ నుంచి ఎన్నికయ్యారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం నుంచి లోకసభకు ఎన్నికయ్యారు.
రాజ్యసభ సభ్యుడు రవిశంకర్ ప్రసాద్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు.
అనంతకుమార్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన బెంగళూర్ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.
మేనకా గాంధీ ఆంగ్లంలో ప్రమాణం చేశారు. ఆమె యుపిలోని ఫిలిబిత్ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. గతంలో ఆమె కేంద్ర మంత్రిగా పనిచేశారు.

కల్ రాజ్ మిశ్రా ప్రమాణం చేశారు. ఆయన యుపిలోని దేవరియా నుంచి లోకసభకు ఎన్నికయ్యారు.
ఎల్‌జెపికి చెందిన రాం విలాస్ పాశ్వాన్ ప్రమాణం చేశారు. బీహీర్‌లో హజీపూర్ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. 8 సార్లు ఆయన లోకసభకు ఎన్నికయ్యారు.
గోపీనాథ్ ముండే కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు
నజ్మా హెప్తుల్లా ఆంగ్లంలో ప్రమాణం చేశారు. ఆమె రాజయ్సభ ఉప సభాపతిగా పనిచేశారు. అయిదు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. మోడీ మంత్రివర్గంలో అతి పెద్ద వయస్కురాలు ఆమె. ఆమెకు 74 ఏళ్లు.
ఉమాభారతి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. ఆమె ఝాన్సీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.

సదానంద గౌడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన బెంగళూర్ ఉత్తరం నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.
కేంద్ర మంత్రిగా నితిన్ గడ్కరీ ప్రమాణ స్వీకారం చేశారు. నాగపూర్ లోకసభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. బిజెపి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
కేంద్ర మంత్రిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎం వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు.
అరుణ్ జైట్లీ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాజ్‌నాథ్ సింగ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఆ తర్వాత సుష్మా స్వరాజ్ ప్రమాణం చేశారు.
భారత ప్రధానిగా నరేంద్ర మోడీ హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి మీద ప్రమాణం చేశారు. ప్రణబ్ ముఖర్జీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే కరత్వాళ ధ్వనులు హోరెత్తాయి.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వేదిక మీదికి చేరుకున్నారు. ఆయన రాగానే మోడీ ప్రమాణ స్వీకారానికి వచ్చిన వారంతా నించున్నారు. జాతీయ గీతాలాపన ప్రారంభమైంది.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, కాబోయే తెలంగాణ ముఖ్మమంత్రి కె. చంద్రశేఖర రావు మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.

అఫ్గనిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ఆయన మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, సుశీల్ కొయిరాలతో అభినందనలు పంచుకున్నారు.
నరేంద్ర మోడీ సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. ఆయన పక్కన రాజ్‌నాథ్ సింగ్ కూర్చుకున్నారు. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ కూడా రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు.
శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్ష రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. రాజపక్షను ఆహ్వానించిందుకు నిరసన వ్యక్తం చేస్తూ జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన నిర్వహించిన వైగోను పోలీసులు అంతకు ముందు అరెస్టు చేశారు.
పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాల కూడా రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. మోడీ పట్టాభిషేకానికి వచ్చిన అతిథులను అద్వానీ ఆత్మీయంగా పలకరించారు.

రాహుల్ గాంధీ కూడా రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. నవ్వు ముఖాలతో మన్మోహన్, సోనియా, రాహుల్ కనిపించారు.
బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ కూడా రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. అద్వానీతో పాటు కూతురు ప్రతిభ కూడా వచ్చారు. అద్వానీ అబ్దుల్ కలాం తదితరులతో కరచనాలం చేశారు. బాలివుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కూడా వచ్చారు.
సోనియా గాంధీ, ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. మన్మోహన్ సింగ్ సోనియాను పలకరించారు.
తన సతీమణితో కలిసి మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.

మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం రాష్ట్రపతి భవన్‌కు చేరుకన్నారు.
మురళీ మనోహర్ జోషి, ఉద్ధవ్ థాకరే రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ తన సతీమణి నీతూ అంబానీతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.

మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడానికి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ హోటల్ నుంచి బయలుదేరారు.
మోడీ సన్నిహితులు అమిత్ షా, రామ్ మాధవ్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.
ప్రధాని పదవికి రాజీనామా చేసిన మన్మోహన్ సింగ్ నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలను కలిశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యులు మోడీ ప్రమాణ స్వీకారాన్ని తిలకించడానికి రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. ఒక్కరొక్కరే రాష్ట్రపతి భవన్ చేరుకుంటున్నారు. సుష్మా స్వరాజ్ రాష్ట్రపతి భవన్‌కు వచ్చారు. ఆమె మోడీ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖను చేపట్టే అవకాశం ఉంది.
నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, ఆయన తండ్రి రాకేష్ రోషన్ ఢిల్లీ వచ్చారు.

నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన 18 మంది విదేశీ నేతలు వచ్చారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు.
అన్నీ ఆలోచించుకునే మోడీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారని రామ్ మాధవ్ అన్నారు.
మోడీని కలవాలని ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నట్లు నవాజ్ షరీఫ్ తెలిపారు. వివాదాల పరిష్కరానికి రేపటి భేటీ ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. రేపు 12 గంటల 10 నిమిషాలకు మోడీతో నవాజ్ షరీఫ్ సమావేశం కానున్నారు. దాదాపు 35 నిమిషాల పాటు ఇరువురు నేతల మధ్య సమావేశం జరిగే అవకాశం ఉంది.
మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కాంగ్రెసు సీనియర్ నేత జైరాం రమేష్ కలిశారు.
మంచి రోజులు త్వరలోనే వస్తాయని నమ్ముతున్నామని కాంగ్రెసు నాయకుడు రాజీవ్ శుక్లా అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలోనే తగ్గుతాయని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఉగ్రవాదం అంతమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.
నరేంద్ర మోడీ పాలనను వాజ్‌పేయి పాలనకు కొనసాగింపుగా భావిస్తున్నానని నవాజ్ షరీఫ్ అన్నారు.
మోడీ మంత్రివర్గంలో తనకు బెర్త్ దక్కనుందుకు రాందాస్ అథవాలే ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం లేదు.
నరేంద్ర మోడీకి నేపాల్ ప్రధాని పశుపతినాథ్ విగ్రహాన్ని బహూకరించారు.

ప్రజాస్వామ్యవాదులకు ఈ రోజు ఆనందకరమైన రోజు అని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. తాము ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేరుస్తామని ఆమె చెప్పారు.
మోడీ పాలన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని తాను భావిస్తున్నానని మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అన్నారు.
శ్రీలంక, పాకిస్తాన్ దేశాధిపతులతో పాటు సార్క్ దేశాల రాక పట్ల ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. ఇది చాలా మంచి పరిణామం అన్నారు. ఆయా దేశాలతో భారత్‌కు మంచి సంబంధాలు ఏర్పడతాయని ఆకాంక్షించారు. బిజెపి పాలనలో తమ మార్క్ చూపిస్తామన్నారు.
సికింద్రాబాద్ నుండి గెలుపొందిన బండారు దత్తాత్రేయకు ఈసారి బెర్త్ దక్కలేదు. విస్తరణలో ఆయనను తీసుకునే అవకాశముంది.
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తాజ్ మాన్సింగ్ హోటల్‌కు చేరుకున్నారు.
మోడీ మంత్రివర్గంలో అరుణ్ జైట్లీకి ఆర్థిక శాఖతో పాటు డిఫెన్స్ శాఖ కూడా దక్కే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఢిల్లీకి చేరుకున్నారు. హేమమాలిని మాట్లాడుతూ... మోడీ పైన ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిని ఆయన నెరవేర్చుతారని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు.
ఆజ్ తక్ సమాచారం ప్రకారం.. మోడీ ప్రమాణ స్వీకారానికి సల్మాన్ ఖాన్ హాజరు కానున్నారు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/pzqqeGRkMi0?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>
మోడీ కేబినెట్లో ప్రస్తుతానికి తనకు అవకాశం దక్కిందని, విస్తరణలో మరికొంతమందిని తీసుకుంటారని శివసేన ఎంపీ అనంత్ గీతే అన్నారు.
మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఆయన గెలుపొందిన పవిత్ర కాశీలో రోజంతా సెలబ్రేషన్స్ చేస్తున్నారు.
అరుణ్ శౌరిని ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్‌గా నియమించే అవకాశముంది.
తమిళ పార్టీ ఎండిఎంకె కార్యకర్తలు రాజపక్ష దిష్టి బొమ్మను ఢిల్లీలో దగ్ధం చేశారు.
శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్‌లు మోడీ ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీ బయలుదేరారు.
రాజపక్ష రాకను నిరసిస్తూ తమిళ పార్టీలు, తమిళులు ఢిల్లీ వీధుల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రాజపక్ష దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్నారు.
రాజపక్ష రాకను నిరసిస్తూ ఆందోళన చేపట్టిన వైగో అరెస్టయ్యారు.
అంతకుముందు నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. శాంతి సందేశంతో భారత్ వెళ్తున్నానని అన్నారు. భారత్ బయల్దేరే ముందు ఇస్లామాబాద్ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాక్ ప్రజలు ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను కోరుకుంటున్నారని తెలిపారు.ఆయనతో పాటు ఆయన శ్రీమతి కుల్సుమ్ నవాజ్, కుమారుడు హుస్సేన్ నవాజ్‌లు కూడా భారత్ వచ్చారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిాపరు.
ఎస్పీ నేతలు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా, శ్రీలంక అధ్యక్షుడు మహీ్ందా రాజపక్ష కూడా ఢిల్లీ చేరుకున్నారు.
మహీందా రాజపక్ష రాక సందర్భంగా వైగో, ఎండిఎంకె కార్యకర్తలు నిరసన ప్రదర్సన నిర్వహించారు.
బంగ్లాదేశ్ పార్లమెంటు స్పీకర్ డాక్టర్ షిరీన్ శర్మిన్ చౌధురి ఢిల్లీకి చేరుకున్నారు.
అఫ్ఘనిస్తాన్్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఢిల్లీకి చేరుకున్నారు.
మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఢిల్లీ చేరుకున్నారు. ఆయన రేపు మంగళవారం మోడీతో సమావేశమయ్యే అవకాశం ఉంది.
కట్టుదిట్టమైన భద్రత మధ్య మోడీ సోమవారం ఉదయం గం.7.30 నిమిషాలకు ఢిల్లీలోని గుజరాత్ భవన్ నుంచి బయలుదేరి రాజ్‌ఘాట్ చేరుకున్నారు. హర్షవర్దన్, విజయ్ గోయల్, ప్రకాష్ జవదేకరి మోడీ వెంట ఉన్నారు. మోడీ సోమవారం సాయంత్రం 6 గంటలకు దేశ ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు.
మోడీ ప్రమాణ స్వీకారానికి 4 వేల మంది హాజరు కానున్నారు. వీరిలో సార్క్ దేశాల అధినేతలు కూడా ఉన్నారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్ష కూడా హాజరవుతున్నారు.
కాంగ్రెసు నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ప్రమాణానికి హాజరవుతున్నారు. మోడీ తల్లి హీరాబెన్ కూడా ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని అంటున్నారు.












Click it and Unblock the Notifications