పట్టపగలు వ్యాపారి కిడ్నాప్: అందరూ చూశారే తప్ప..(వీడియో)
పట్టపగలు అందరూ చూస్తుండగానే నలుగురు దుండగులు కారులో వచ్చి ఓ వ్యాపారినిని కిడ్నాప్ చేశారు. ఇదంతా చుట్టు పక్కల జనం చూస్తూ కూడా ఎవరూ ఆపే ప్రయత్నం చేయకపోవడం శోచనీయం.
జైపూర్: పట్టపగలు అందరూ చూస్తుండగానే నలుగురు దుండగులు కారులో వచ్చి ఓ వ్యాపారినిని కిడ్నాప్ చేశారు. ఇదంతా చుట్టు పక్కల జనం చూస్తూ కూడా ఎవరూ ఆపే ప్రయత్నం చేయకపోవడం శోచనీయం. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
ఈ కిడ్నాప్ వ్యవహారం సీసీటీవీల్లో రికార్డవడంతో ఆ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో సంచలనంగా మారింది. అయితే, ఆ కారుకు నెంబర్ ప్లేట్ కూడా లేకపోవడం గమనార్హం. బాధితుడు అహ్మదాబాద్‌కు చెందిన చిరు వ్యాపారస్థుడు. తన పనుల నిమిత్తం తరచూ ఉదయ్‌పూర్ వస్తూ ఉంటాడు.
కాగా, ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని పలు మీడియా ఛానెళ్లు ప్రసారం చేయడంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అతన్ని అపహరించడానికి ప్రయత్నించింది ఎవరు?.. వ్యాపారంలో ఏమైనా గొడవలు ఇందుకు కారణమా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications