అహ్మదాబాద్ వరుస బాంబుపేలుళ్ళ కేసులో సంచలనతీర్పు.. 38మందికి మరణశిక్ష,11మందికి జీవితఖైదు
అహ్మదాబాద్లో 2008లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ లోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది.2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్‌లోని ప్రత్యేక కోర్టు ఏకంగా 38 మందికి మరణశిక్ష విధించింది. మరో పదకొండు మంది దోషులను జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. భారతదేశంలోని ఒకేసారి 38 మంది మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి. గుజరాతి సీరియల్ పేలుళ్ల కేసులో స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పు దేశంలోనే సంచలనం సృష్టించింది.

అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ళ కేసు.. 56 మంది మృతి, 200 మందికి గాయాలు
జూలై 26, 2008, అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్లలో 56 మంది మరణించారు. కేవలం 70 నిమిషాల వ్యవధిలో జూలై 26 వ తేదీన వరుస బాంబు పేలుళ్లతో అహ్మదాబాద్ వణికిపోయింది. ఈ పేలుళ్లలో 56 మంది మరణించగా, 200 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. గత వారం, గుజరాత్‌లోని ప్రత్యేక కోర్టు పేలుళ్లకు సంబంధించి 49 మందిని దోషులుగా నిర్ధారించి, 28 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. శిక్షలు ఖరారు కాగానే నిందితులంతా శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. అయితే మరణశిక్షలను గుజరాత్ హైకోర్టు నిర్ధారించాల్సి ఉంటుంది.

నిందితులపై నమోదైన సెక్షన్లు ఇవే .. దోషులుగా తేల్చిన కోర్టు
భారతీయ శిక్షాస్మృతి, యూఏపీఏ, పేలుడు పదార్థాల చట్టం మరియు ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నిందితులను దోషులుగా నిర్ధారించారు. ఆయుధ చట్టం కింద ఒక నిందితుడిని కూడా దోషిగా నిర్ధారించారు. IPCలోని ఇతర సెక్షన్లు 302 (హత్య), 307 (హత్య ప్రయత్నం), 121 (ఎ) (యుద్ధం చేయడానికి కుట్ర) మరియు 124 (ఎ) (విద్రోహం) కింద వారు దోషులుగా నిర్ధారించబడ్డారు. మరియు UAPA యొక్క 16(1)(a)(b) ఉగ్రవాద చర్య కూడా శిక్షకు సంబంధించినది.
Recommended Video

ఇండియన్ ముజాహిదీన్ కు చెందినవారే దాడులకు పాల్పడినట్టు నిర్ధారణ
గత ఏడాది సెప్టెంబర్‌లో 77 మంది నిందితులపై విచారణను కోర్టు ముగించింది. విచారణలో ఉన్న 78 మంది నిందితుల్లో ఒకరు అప్రూవర్‌గా మారారు.నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)కి చెందిన తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం)తో సంబంధమున్న వ్యక్తులే ఈ పేలుళ్లకు పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు. 2002 గోద్రా అనంతర అల్లర్లకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఐఎం ఉగ్రవాదులు ఈ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications