శశికళకు చెక్: దేవుడు వచ్చినా ఆపలేరు, మోనంగా సీఎం పళనిసామి, పన్నీర్ స్కెచ్!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ రచ్చ రాజకీయం వ్యవహారం తీరస్థాయికి చేరుకుంది. అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ, టీటీవీ దినకరన్ ల పదవుల నుంచి శాశ్వతంగా తప్పించడానికి ఎడప్పాడి పళనిసామి తీవ్ర కసరత్తులు చేస్తున్నారు.

అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశం జరగకుండా చూడాలని టీటీవీ దినకరన్, మన్నార్ గుడి మాఫియా ప్రయత్నాలు చేస్తుంది. ముందుగా నిర్ణయించిన తేదీ (సెప్టెంబర్ 12వ తేదీ) అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశం కచ్చితంగా జరుగుతోందని, ఆ దేవుడు వచ్చినా సభను అడ్డుకోలేరని తమిళనాడు మంత్రి జయకుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

AIADK general body council will meet as per the schedule

అన్నాడీఎంకే పార్టీ వ్యవహారం కోర్టులో ఉందని, ఈ విషయంపై తాను ఎక్కువగా మాట్లాడనని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి అంటున్నారు. అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశం ఎలాగైనా నిర్వహించి శశికళ, దినకరన్ ను సాగనంపాలని పన్నీర్ సెల్వం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

మొత్తం మీద అన్నాడీఎంకే పార్టీ ఆధిపత్యపోరు తుదిదశకు చేరుకుంది. ఈనెల 12వ తేదీ చెన్నైలోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించి శశికళ, టీటీవీ దినకరన్ ను శాశ్వతంగా పార్టీ నుంచి బహిష్కరించాలని ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AIADK general body council will meet as per the schedule, says minister Jayakumar.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X