షాక్: తమిళనాడు సీఎంపై ఎమ్మెల్యేల తిరుగుబాటు: ముగ్గురు వస్తే ఢమాల్ !
తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి మీద తిరుప్పూరు ఎమ్మెల్యే గుణశేఖరన్, సూలూరు ఎమ్మెల్యే కనకరాజ్ ఎదురుదాడికి దిగారు. అవసరం అయితే ప్రభుత్వాన్ని, పార్టీని ఎదిరిస్తామని తేల్చి చెప్పి పళనిస్వామి
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి సొంతగూటిలోని ఎమ్మెల్యేలు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. మాకు మీ ప్రభుత్వం కంటే మా నియోజక వర్గం ప్రజలు సమస్యలు పరిష్కారం ముఖ్యం అంటున్నారు.
ఓ ఎమ్మెల్యే సమస్యల పరిష్కార నినాదంతో నిరాహార ధీక్ష చేపట్టారు. మరో ఎమ్మెల్యే ప్రజలే తనకు ముఖ్యం అని, అవసరం అయితే ప్రభుత్వాన్ని, పార్టీని ఎదిరించేందుకు తాను సిద్దంగా ఉన్నానని బహిరంగంగా చెప్పడంతో ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి.

రాత్రికి రాత్రే తిరుగుబాటు
నియోజక వర్గంలోని సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఎడప్పాడి పళనిసామి వర్గంలో ఉన్న తిరుప్పూర్ దక్షిణ నియోజక వర్గం ఎమ్మెల్యే గుణశేఖరన్ నిరాహార ధీక్ష చేపట్టారు.

శశికళ గ్రూప్ లో ముఖ్యుడు
శశికళ శిభిరంలో తానో ముఖ్యుడు అన్నట్లు ఇంతకాలం వ్యాఖ్యలు చేసిన గుణశేఖరన్ ఇప్పుడు తన నియోజక వర్గం ప్రజలే తనకు ముఖ్యం అటున్నారు. వారు ఎలా చెబితే అలా నడుచుకుంటానని బెదిరింపు వ్యాఖ్యలు అందుకున్నారు.

నడిరోడ్డులో టెంటు వేసుకుని
ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మీద బెదిరింపు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే గుణశేఖరన్ తిరుప్పూర్ లో నడిరోడ్డు పక్కన టెంటు వేసుకుని నిరాహార ధీక్షకు దిగారు. గతంలో ధిక్కారస్వరం పెంచిన గుణశేఖరన్ కు శశికళ గ్రూప్ నచ్చచెప్పింది. అయితే ఈ సారి నేను ఎవ్వరి మాట వినను అంటూ భీష్మించుకుని ధీక్ష చేస్తున్నారు. ధీక్ష చేస్తున్న శిభిరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కేవలం జయలలిత ఫోటో మాత్రం పెట్టారు.

మరో ఎమ్మెల్యే కనకరాజ్
సూలూరు ఎమ్మెల్యే కానకరాజ్ కూడా గుణశేఖరన్ బాటపట్టారు. ఎడప్పాడి ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకోవడం లేదని ఎదురుతిరిగారు. తన నియోజక వర్గ ప్రజలు ఎలా చెబితే అలా చేస్తానని కనకరాజ్ తేల్చి చెప్పారు.

ఎడప్పాడికి బహిరంగంగా
గతంలో ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి బహిరంగంగానే బెదిరింపులకు దిగిన కానకరాజ్ కు నచ్చచెప్పడంతో శాంతించారు. అయితే ఈ సారిమాత్రం నాకు ప్రభుత్వం, పార్టీ ముఖ్యం కాదు, నా ప్రజలు ముఖ్యం, నేను ఇక్కడే ఉంటా, వారు ఎలా చెబితే అలా చేస్తా అంటూ రివర్స్ గేర్ వేశారు.

రోజుకోకరు వెలుతారని ఆందోళన
ఎమ్మెల్యేలు గుణశేఖరన్, కానకరాజ్ బాటలో మరి కోందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే అవకాశం ఉందని సమాచారం. గుణశేఖరన్ స్వయంగా ఈ విషయం చెప్పారు. నాలాగానే చాల మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, అందరూ బయటకు వచ్చేస్తారని అంటున్నారు.

ఇద్దరు వస్తే అంతే
ఐదు మంది ఎమ్మెల్యేలు బయటకు వస్తే ఈ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని గుణశేఖరన్ బహిరంగంగానే చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు ఎదురుతిరగడంతో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు బయటకు వస్తే పళనిసామి ప్రభుత్వం కుప్పకూలిపోతుంది.

అప్పుడే చెప్పిన స్టాలిన్
తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం తనంతకు తానుగానే కుప్పకూలడం ఖాయం అని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ పదేపదే చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే అదే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
-
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే -
తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ - ప్రభుత్వం కీలక నిర్ణయం...!!












Click it and Unblock the Notifications