తమిళనాడు ఎన్నికలు: తెలుగులో జయలలిత పార్టీ ప్రచారం
చెన్నై: తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతున్నాయి. పార్టీలు కొన్నిచొట్ల తెలుగులోనూ ప్రచారం చేస్తున్నాయి.
ఆవడి నియోజకవర్గంలో తెలుగు ఓటర్లు ఉన్నారు. వారిని ఆకట్టుకునేందుకు అన్నాడీఎంకే అభ్యర్థి 'మాఫోయ్' పాండియరాజన్ తెలుగులోనూ ఎన్నికల ప్రచార కరపత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. అన్నివర్గాల వారికీ దగ్గరయ్యేందుకు ఆయన శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

అన్ని భాషల ప్రజలు నియోజకవర్గంలో ఉండటంతో తమిళంతోపాటు తెలుగు, మలయాళం, హిందీ, ఆంగ్లంలో ఈ కరపత్రాలను ముద్రించారు. ప్రచారం చేసే ప్రాంతానికి తగ్గట్టు వాటిని పంపిణీ చేస్తున్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఆ భాష వాటినే పంచి పెడుతున్నారు.












Click it and Unblock the Notifications