'జయలలిత ప్రతిష్ట మంటకలిసింది, 2 నెలల్లో శశికళ పార్టీ ఉండదు'

అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు తీర్పుతో దివంగత జయలలిత ప్రతిష్ట మంటకలిసిందని తమిళనాడు రాజకీయ నాయకుడు అన్బుమణి రామదాస్ మంగళవారం నాడు అన్నారు.

చెన్నై: అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు తీర్పుతో దివంగత జయలలిత ప్రతిష్ట మంటకలిసిందని తమిళనాడు రాజకీయ నాయకుడు అన్బుమణి రామదాస్ మంగళవారం నాడు అన్నారు.

జయ అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. శశికళ సహా నిందితులకు నాలుగేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. కేసు కొనసాగుతుండగానే జయలలిత మృతి చెందారు.

ఈ రోజు తీర్పు పైన అన్బుమణి మాట్లాడారు. మరో రెండు నెలల్లో అన్నాడీఎంకే పార్టీ కనుమరుగు కావడం ఖాయమని చెప్పారు. గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటు పైన వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు.

AIADMK men celebrating SC verdict in DA case say Jayalalithaa was innocent

సుప్రీం తీర్పుతో జయ, శశికళల ప్రతిష్ట మసకబారిందన్నారు. పన్నీరు సెల్వం, పళని స్వామిలు అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవాలన్నారు.

తమిళనాడులో ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే.. రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే అన్నారు. ద్రవిడ పార్టీల పాలనతో తమిళ ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని చెప్పారు. తమిళ ప్రజలు ఇప్పుడు ప్రత్యామ్నాయల వైపు చూస్తున్నారన్నారు. కాగా, ఈ తీర్పుతో శశికళకు శిక్ష పడుతుండటంతో పన్నీరు వర్గం అన్నాడీఎంకే పార్టీ సంబరాలు చేసుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+