వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడుకు సీఎం లేరు, రుద్దితే అదేగతి, శశికళ ఉంటే ?

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ ఆ పార్టీ నాయకులను ఒక్కతాటిపైకి తీసుకురాగలరేమో కాని పార్టీ కార్యకర్తలను మాత్రం ఏకతాటి మీదకు తీసుకురాలేరని ఆర్ఎస్ఎస్ సిద్దాంతకర్త, తుగ్గక్ పత్రిక ఎడిటర్ ఎస్. గురుమూర్తి అన్నారు.

శశికళ నాయకత్వాన్ని అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించరని ఆయన స్పష్టం చేశారు. జయలలిత మరణించిన తరువాత తమిళనాడుకు ముఖ్యమంత్రి లేరని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే అంతే: తుగ్లక్ !రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే అంతే: తుగ్లక్ !

ఆత్మవిశ్వాసం లేకుంటే ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవడం మంచిందని సలహా ఇచ్చారు. శశికళ పార్టీ అధినేత్రిగా ఎన్నికైన తరువాత అన్నాడీఎంకే పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయని గురుమూర్తి చెప్పారు.

AIADMK party General Secretary Sasikala, Thuglak Editor S Gurumurthy.

అన్నాడీఎంకే పార్టీ త్వరలోనే ముక్కలు అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. శశికళ నాయకులను బలవంతంగా రుద్దితే కచ్చితంగా పార్టీ ముక్కలైపోతుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని చెప్పారు.

జయలలిత మేనకోడలు దీపా డెడ్ లైన్: నేడు ప్రకటన !జయలలిత మేనకోడలు దీపా డెడ్ లైన్: నేడు ప్రకటన !

నాయకుల మీద మీరు బలవంతంగా నాయకత్వాన్ని రుద్దతున్నారని, అయితే కార్యకర్తలను మీరు ఏమీ చెయ్యలేరని పరోక్షంగా శశికళకు ఆయన చురకలు అంటించారు. ప్రస్తుతం అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తల మధ్య కుదరడం లేదని గురుమూర్తి అన్నారు.

గతంలో ద్రవిడ మున్నేట్ర కజగం నుంచి విడిపోయిన ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) పోటీగా అన్నాడీఎంకే పార్టీని స్థాపించారని ఆయన గుర్తు చేశారు. తరువాత 1987-88లో అన్నాడీఎంకే పార్టీ కూడా ముక్కలు అయ్యిందని, తరువాత జయలలిత ఆ పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారని ఆయన వివరించారు. శశికళ ఇలానే ప్రవర్తిస్తే క్రమంగా ఆ పార్టీ ముక్కలు అవుతందుని గురుమూర్తి చెప్పారు.

English summary
RSS ideologue, Chartered Accountant and newly-appointed Thuglak Editor S Gurumurthy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X