వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం పళనిసామికి రిలీఫ్: దినకరన్ ఎమ్మెల్యేలకు గవర్నర్ ఝలక్: ప్రతిపక్షాలకు షాక్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీలో రెబల్ రాజకీయాలు చెయ్యాలనుకుంటున్న టీటీవీ దినకరన్ కు ఆ రాష్ట్ర గవర్నర్ (ఇన్ చార్జ్) సీహెచ్. విద్యాసాగర్ రావ్ ఝలక్ ఇచ్చారు. దినకరన్ వర్గంలోని 20 మందికి పైగా ఎమ్మెల్యేలు ఇంకా అన్నాడీఎంకే పార్టీలోనే ఉన్నారని సీహెచ్. విద్యాసాగర్ రావ్ చెప్పారు.

ఉప ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం అనర్హుడు: హై కోర్టులో పిటిషన్!ఉప ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం అనర్హుడు: హై కోర్టులో పిటిషన్!

20 మంది ఎమ్మెల్యేల డిమాండ్ మేరకు బలపరీక్ష నిర్వహించలేమని గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ తేల్చి చెప్పడంతో టీటీవీ దినకరన్ దిమ్మతిరిగింది. బుధవారం తమిళనాడులోని ప్రతపక్షాల నాయకులు గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ ను కలిసి వెంటనే సీఎం ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించాలని మనవి చేశారు.

 AIADMK rebel MLAs will lose their battle if they go by TN Governor's logic

ప్రతిపక్షాలు చేసిన మనవిని గవర్నర్ విద్యాసాగర్ రావ్ సున్నితంగా తిరస్కరించారని వెలుగు చూసింది. దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేలు ఇంకా అన్నాడీఎంకే పార్టీలోనే ఉన్నారని, వారు రాజీనామా చెయ్యలేదని, వారి కోరిక మేరకు ఇప్పుడు బలపరీక్ష నిర్వహించడం సాధ్యం కాదని గవర్నర్ విద్యాసాగర్ రావ్ షాక్ ఇచ్చారు.

హీరో విశాల్ కు గాలం వేసిన టీటీవీ దినకరన్: దూకుడు మీద మన్నార్ గుడి మాఫియా!హీరో విశాల్ కు గాలం వేసిన టీటీవీ దినకరన్: దూకుడు మీద మన్నార్ గుడి మాఫియా!

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపక్షాలు చేసిన డిమాండ్ ను గవర్నర్ విద్యాసాగర్ రావ్ తిరస్కరించారని వీసీకే చీఫ్ తిరుమావలన్, సీపీఐ నేత జీ. రామక్రిష్ణ మీడియాకు చెప్పారు. ప్రస్తుతం దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేలు రిసార్ట్ రాజకీయాలు చెయ్యాలని ప్రయత్నించి ఎదురుదెబ్బ తిన్నారని న్యాయనిపుణులు అంటున్నారు.

English summary
AIADMK rebel MLAs will lose their battle if they go by TN Governor's logic, says legal experts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X