జైల్లో చిన్నమ్మ: శశికళ కోసం బెంగళూరు గెస్ట్ హౌస్ లో రజనీ మకాం
బెంగళూరు: అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు బెంగళూరు జైల్లో ఎవైనా అవసరాలు తీర్చాలంటే ప్రత్యేకంగా ఓ పనిమనిషి ఇక్కడి గెస్ట్ హౌస్ లో మకాం వేసింది. జయలలిత దగ్గర ఇంతకాలం పని చేసిన రజనీ అనే మహిళ జైల్లో ఉన్న శశికళ బాగోగులు చూసుకుంటున్నారని వెలుగు చూసింది.
పోయెస్ గార్డెన్ లో జయలలితకు ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా పని చేస్తున్న వారిలో రజనీ అనే మహిళ ఒకరు. జయలలిత మరణించిన తరువాత పోయెస్ గార్డెన్ లో పని చేసేవారి సంఖ్య తగ్గిపోయింది. కొందరు అక్కడ శశికళ దగ్గర పని చెయ్యడం ఇష్టంలేక ఉద్యోగం వదిలేసి వెళ్లిపోయారు.
పోయెస్ గార్డెన్ లో పని చేస్తున్న రజనీ (మన్నార్ గుడి మాఫియా) మాత్రం అక్కడే శశికళకు సేవలు చేసుకుంటూ ఉండిపోయింది. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శశికళ బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో అనుభవిస్తున్నారు.

శశికళకు జైల్లో ఎమైనా అవసరం అయినా, బయట నుంచి ఎమైనా తీసుకెళ్లి ఇవ్వాలన్నా ఓ నమ్మకమైన వ్యక్తి అవసరం అని మన్నార్ గుడి మాఫియా గుర్తించింది. ఈ విషయంపై శశికళ దగ్గర సూచనలు తీసుకున్న ఆమె వర్గీయులు రజనీని బెంగళూరు పంపించారు.
పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు సమీపంలోని ఓ గెస్ట్ హౌస్ లో మకాం వేసిన రజనీ శశికళకు ఏమి అవసరం అయితే అవి బయట నుంచి తీసుకెళ్లి ఇస్తున్నారని వెలుగు చూసింది. శశికళకు బయటి నుంచి రజనీనే ఆహారం తీసుకెళ్లి ఇస్తున్నారని సమాచారం.
ఈ విషయం అన్నాడీఎంకేలోని శశికళ వర్గం నాయకులు చెబుతున్నారు. చిన్నమ్మ అవసరాల కోసం ఆమె నమ్మకస్తురాలైన రజనీ బెంగళూరులోని గెస్ట్ హౌస్ లో ఉన్నారని, శశికళకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరాలు తీర్చుతున్నారని చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications