జయలలిత చేదు అయ్యారు: అమ్మ ఫోటో తీసేసి చిన్నమ్మ ఫోటో !

తమిళనాడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న జయలలితను అప్పుడే మరిచిపోవాలని ఆపార్టీ నాయకులు అనుకుంటున్నారా ? అంటే అవుననే సమాధానం ప్రత్యక్షంగా కనిపించింది.

చెన్నై: తమిళనాడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న జయలలితను అప్పుడే మరిచిపోవాలని ఆపార్టీ నాయకులు అనుకుంటున్నారా ? అంటే అవుననే సమాధానం ప్రత్యక్షంగా కనిపించింది.

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన జయలలిత ఆకస్మికంగా మృతితో చిన్నమ్మ శశికళకు గురువారం పార్టీ పగ్గాలు అప్పగించాయి. గురువారం తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు పలువురు మంత్రులు పోయెస్ గార్డెన్ చేరుకుని అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు తీసుకున్న నిర్ణయాన్ని ఆమెకు చెప్పారు.

అదే సమయంలో చిన్నమ్మ శశికళ దగ్గరకు వెళ్లిన పార్టీ నాయకులను చూసిన కార్యకర్తలు షాక్ కు గురైనారు. ఒక్క రోజులో మనుషులు ఇలా మారిపోతారా ? వీరిని ఆశ్రయించి ఈ స్థాయికి తీసుకువచ్చిన అమ్మ జయలలితను అప్పుడే మరిచిపోయారా ? అని కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

 AIADMK supporters roaming around with the photo of sasikala in their shirt Pockets.

జయలలిత ఉన్న సమయంలో ఆమె దగ్గరకు వెళ్లి పలకరించాలన్నా, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకోవాలన్నా నాయకులు వారి షర్టు జోబులో కచ్చితంగా అమ్మ జయలలిత ఫోటో పెట్టుకునేవారు. అది పార్టీ సాంప్రధాయంగా వచ్చేసింది.

గురువారం అన్నాడీఎంకే చీఫ్ గా పగ్గాలు చేపట్టిన తరువాత శశికళ దగ్గరకు వెళ్లిన నాయకుల జోబులో అమ్మ జయలలిత ఫోటో మాయం అయ్యింది. జయలలిత ఫోటో తీసి పక్కన పెట్టిన నాయకులు ఆ స్థానంలో చిన్నమ్మ ఫోటో పెట్టుకుని మీడియాకు, కార్యకర్తలకు దర్శనం ఇచ్చారు.

అదేమిటని కార్యకర్తలు ప్రశ్నిస్తే ఇప్పుడు పార్టీ చీఫ్ చిన్నమ్మ కదా, అది అంతేలే అంటూ చిన్నగా జారుకుంటున్నారు. పార్టీ పదవుల కోసం ఇంత కాలం జయలలిత ఆదరించిన మీరు అమ్మ ఫోటో పక్కన పెట్టి ఒక్క రోజులో ఇలా మారిపోతారా ? అంటూ కార్యకర్తలు నాయకుల మీద మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+