వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: కొవాగ్జిన్ ట్రయల్స్‌కు వాలంటీర్లు లేరు -ఆందోళనలో ఎయిమ్స్ -ప్రజలకు పిలుపు

|
Google Oneindia TeluguNews

భారత్ లో కరోనా మహమ్మారిని కట్టడి చేసే దిశగా మరికొద్ది రోజుల్లోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు కానుండగా.. కొవాగ్జిన్ ట్రయల్స్ విషయంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ సహకారంతో రూపొందుతోన్న తొలి దేశీ వ్యాక్సిన్ కొవాగ్జిన్ ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేయగా, ఎయిమ్స్ తనవంతు సహకారాన్ని అందించింది. మిగతా వ్యాక్సిన్ల ట్రయల్స్ జోరుగా సాగుతున్నా.. కొవాగ్జిన్ ప్రయోగాలకు మాత్రం వాలంటీర్లు ముందుకురాని దుస్థితి నెలకొంది.

Bigg Boss 4: కుటుంబాల్లో చిచ్చు -ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు -హోస్ట్‌పై మండిపాటుBigg Boss 4: కుటుంబాల్లో చిచ్చు -ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు -హోస్ట్‌పై మండిపాటు

కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు వాలంటీర్ల కొరత ఏర్పడిందని, ప్రయోగాల్లో పాల్గొనేందుకు జనం ముందుకు రావడంలేదని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)కు అవసరమైన వాలంటీర్లు దొరకడం లేదని ఆ సంస్థ పేర్కొంది. కరోనా టీకా త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందన్న భావన నెలకొనడంతో క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనడానికి వాలంటీర్లు ఆసక్తి చూపడంలేదని ఎయిమ్స్ అధికారులు తెలిపారు.

 AIIMS unable to find volunteers for phase-3 trial of Bharat Biotechs covaxin

కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌‌కు 1500-2,000 మంది వరకు వాలంటీర్లు అవసరం కాగా.. ఇప్పటివరకు 200 మంది మాత్రమే ముందుకు వచ్చినట్లు మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా వ్యవహరిస్తున్న ఎయిమ్స్‌ అధికారి డాక్టర్‌ సంజయ్‌ రాయ్‌ చెప్పారు. తొలి దశ ప్రయోగాలకు 100 మంది అవసరమైతే 4,500 మంది ఆసక్తి చూపారని, రెండో దశ ట్రయల్స్‌కు 4వేల దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. టీకా వేయించుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని కోరారు. ప్రకటనలు, ఈ మెయిళ్లు, ఫోన్‌ కాల్స్‌ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని సంజయ్‌ సూచించారు.

పిరుదులపై ప్రేమ ప్రాణం తీసింది -లైవ్​లో చూసి షాక్​ -సర్జరీ వికటించి ప్రముఖ మోడల్ మృతిపిరుదులపై ప్రేమ ప్రాణం తీసింది -లైవ్​లో చూసి షాక్​ -సర్జరీ వికటించి ప్రముఖ మోడల్ మృతి

కొవాగ్జిన్ ట్రంయల్స్ కు సంబంధించి మొదటి దశలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. 100 మంది పాల్గొనాల్సి ప్రయోగాలకు గరిష్టంగా 4,500 దరఖాస్తులు వచ్చాయి. కానీ ప్రస్తుత మూడో దశకు మాత్రం వాలంటీర్లు రావడంలేదు. ఒక వారం లేదా 15 రోజుల్లో దేశంలో టీకా అందుబాటులోకి వస్తుందనే భావన ప్రతి ఒక్కరిలో ఉందని, కాబట్టి కొవాగ్జిన్ ట్రయల్స్‌లో పాల్గొనడానికి ఇష్టపడటం లేదని అధికారులు అంటున్నారు. కొవాగ్జిన్ సురక్షితమైందని, అంతగా దుష్ప్రభావాలు తలెత్తలేదని తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌ వివరాలను సంస్థ ఇటీవలే ప్రకటించింది.

English summary
The AIIMS here is unable to find the required number of volunteers for the phase-3 trial of Bharat Biotech's COVID-19 vaccine covaxin, with officials saying people are unwilling to participate in the exercise thinking why take part in a trial when a vaccine would be available soon for everybody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X