సింధు నదీ ఒప్పందంపై అఖిలపక్ష భేటీలో కేంద్రానికి ఓవైసీ కీలక ప్రశ్న..!
కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రభావం పాకిస్తాన్ పై తీవ్రంగా పడుతుందని తొలుత అంచనా వేశారు. కానీ దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో నిన్న కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీలోనూ దీని ప్రస్తావన వచ్చింది. ఉగ్రదాడి తర్వాత కేంద్రం తీసుకున్న నిర్ణయాల్ని విపక్షాలన్నీ స్వాగతించాయి.
అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయాలను ప్రాక్టికల్ గా ఎలా అమలు చేయగలమన్న ప్రశ్నలు కూడా సంధించాయి. ఇదే క్రమంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా కేంద్రానికి ఓ కీలక ప్రశ్న వేశారు. ముందుగా పాకిస్తాన్ తో ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని ఓవైసీ స్వాగతించారు. అయితే సింధు జలాలు పాకిస్తాన్ వైపు వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారని కేంద్రాన్ని ప్రశ్నించారు.

సింధూ జల ఒప్పందాన్ని రద్దు చేయడం చాలా మంచిదే, కానీ నీటిని ఎక్కడ ఉంచుకుంటాం అని కేంద్రాన్న ఓవైసీ ప్రశ్నించారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఇది రాజకీయ సమస్య కాదన్నారు. పహల్గామ్ దాడికి తీవ్రంగా స్పందించే హక్కు భారతదేశానికి అంతర్జాతీయ చట్టం ఉందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం ఇచ్చే దేశంపై చర్య తీసుకోవచ్చని, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఆత్మరక్షణ కోసం వైమానిక, నావికా దిగ్బంధన చేయడానికి, వారికి ఆయుధ అమ్మకాలపై ఆంక్షలు విధించడానికి అంతర్జాతీయ చట్టం తమకు అనుమతి ఇస్తుందని ఓవైసీ తెలిపారు.
#WATCH | Delhi: After attending the all-party meeting convened by the central government, AIMIM chief Asaduddin Owaisi says, "...The central government can take action against the nation which shelters the terrorist groups. The international law also permits us to do an air and… pic.twitter.com/mg3qjKsEnx
— ANI (@ANI) April 24, 2025
మరోవైపు పహల్గాంలోని బైసారన్ గడ్డి మైదానంలో జరిగిన దాడి సమయంలో భద్రతా ప్రతిస్పందనలో జాప్యం గురించి కూడా ఒవైసీ ప్రశ్నలు లేవనెత్తారు. బైసారన్ గడ్డి మైదానంలో సీఆర్పీఎఫ్ బలగాలను ఎందుకు మోహరించలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. త్వరిత ప్రతిచర్య బృందం అక్కడికి చేరుకోవడానికి గంట సమయం ఎందుకు తీసుకుందని అడిగారు. వారు తమ మతాన్ని అడిగి ప్రజలను కాల్చి చంపారని గుర్తుచేశారు. ఈ హత్యలన్నీ కొందరిని లక్ష్యంగా చేసుకున్నాయని, మతపరమైనవని అని ఓవైసీ తెలిపారు.












Click it and Unblock the Notifications