ఎయిర్ఇండియా విమానానికి తప్పిన పెనుముప్పు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో సోమవారం ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. రన్ వేపై విమానం టైర్ పేలిపోయింది. అయితే పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.
విమానం టైర్ పేలిన ఘటనతో రన్ వేను క్లియర్ చేయడానికి కనీసం గంట సమయం పడుతుందని, దీని మూలంగా మిగిలిన విమానాలకు ఆలస్యమయ్యే అవకాశం ఉందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.

దీంతో శ్రీనగర్ విమానాశ్రయానికి వచ్చే కొన్ని విమానాలను ఛండీఘర్ విమానాశ్రయానికి మళ్లించారు. మొత్తం 8 విమానాలు నిలిచిపోగా, రెండు విమానాలను దారి మళ్లించారు.
ఇది ఇలా ఉండగా, ఇటీవల ఎయిర్ ఇండియా విమానంలో సిబ్బంది సరఫరా చేసిన ఫుడ్ ప్లేటులో బల్లి దర్శనమివ్వడంతో కలకలం రేగింది. ఈ వివాదం సద్దుమణకగముందే ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.












Click it and Unblock the Notifications