Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Air India Crash: ఎయిరిండియా ఫ్లైట్ ఘటనపై మరో ట్విస్ట్- సుప్రీంకు పైలట్ తండ్రి..!

ఈ ఏడాది జూన్ 12న అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో పాటు మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇప్పటికే విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో దర్యాప్తు జరుపుతోంది. ఈ దర్యాప్తులో భాగంగా సేకరించిన ప్రాథమిక వివరాలను గతంలోనే వెల్లడించింది. ఇందులో ఎయిరిండియా ఫ్లైట్ ప్రమాదానికి ముందు పైలట్ల సంభాషణలను విడుదల చేసింది. దీనిపై పైలట్ల సంఘాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు నత్తనడకన సాగుతోంది.

దీంతో పాటు మరికొన్ని సంస్ధలు కూడా తమకు లభించిన వివరాలతో దర్యాపు సాగిస్తున్నాయి. అయితే వీటిలో ఏమీ తేలడం లేదని, ఈ దర్యాప్తుల్నీ ఆపేసి కొత్తగా జ్యుడిషియల్ దర్యాప్తు చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పైలట్ సుమీత్ సభర్వాల్ తండ్రి పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో పైలట్ సుమీత్ ప్రాణాలు కోల్పోయారు. విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో విచారణలో పైలట్ల తప్పిదం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించడంపై ఆగ్రహంగా ఉన్న సుమీత్ తండ్రి పుష్కరాజ్ సభర్వాల్ ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Air India Crash Pilot s Father Seeks Judicial Inquiry from Supreme Court and close all probes

ఇందులో ఆయన.. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం ప్రమాద ఘటనపై న్యాయమైన, పారదర్శకమైన , సాంకేతికంగా పటిష్టమైన దర్యాప్తును నిర్వహించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలోని, స్వతంత్ర విమానయాన, సాంకేతిక నిపుణులను సభ్యులుగా కలిగి ఉన్న న్యాయ పర్యవేక్షణ కమిటీ లేదా విచారణ కోర్టుని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే జూలైలో ఏఏఐబీ ఇచ్చిన ప్రాథమిక నివేదికతో సహా, ఇతర ప్రతివాదులు నిర్వహించిన అన్ని ముందస్తు దర్యాప్తులను మూసివేసినట్లుగా పరిగణించాలని కోరారు. వారి దగ్గరున్న సమాచారం అంతా సుప్రీంకోర్టు నియమించే కమిటీకి బదిలీ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

Air India Crash Pilot s Father Seeks Judicial Inquiry from Supreme Court and close all probes

ప్రమాద ఘటనపై దర్యాప్తులో విశ్వసనీయత, పారదర్శకత లేకపోవడం పట్ల తాము తీవ్రంగా బాధపడుతున్నట్లు పిటిషనర్ తెలిపారు. పైలట్ దే తప్పు అన్న భావన కల్పించిన ఏఏఐబీ దర్యాప్తు యొక్క స్వాతంత్ర్యం, నిష్పాక్షికత , సమగ్రతను రాజీ పడేలా చేసిందని ఆయన తెలిపారు. ఇది తీవ్రమైన చట్టపరమైన , అంతర్జాతీయ బాధ్యతను సృష్టించిందని ఆరోపించారు. దీనిపై సుప్రీం విచారణ చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+