• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో ఎయిరిండియా ఫ్లైట్ ల్యాండ్: స్వదేశానికి విద్యార్థులు: అక్కడి భయానక పరిస్థితుల గురించి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడ నివసిస్తోన్న భారతీయ విద్యార్థులు, పౌరులను స్వదేశానికి తీసుకొస్తోంది విదేశాంగ మంత్రిత్వ శాఖ. దీనికోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖను సమన్వయం చేసుకుంటోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని రాయబార కార్యాలయం నుంచి వారి పూర్తి వివరాలను తెప్పించుకుంది. దశలవారీగా విద్యార్థులు, పౌరులను స్వస్థలానికి చేర్చే ప్రయత్నాలను మొదలు పెట్టింది.

ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని డొనెట్స్క్, లుహాన్స్క్ రీజియన్లను సర్వ స్వతంత్రంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన తరువాత అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. యుద్ధ వాతావరణం ఉక్రెయిన్‌ను అలముకుంది. అక్కడి ప్రజల్లో యుద్ధ భీతి నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు రాజధాని కీవ్ సహా అన్ని నగరాల్లోనూ నెలకొని ఉన్నాయి. అమెరికా, కెనడా, అల్బేనియా, ఫ్రాన్స్, జర్మనీ వంటి పలు దేశాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న చర్యలను వ్యతిరేకిస్తోన్నాయి. అమెరికా, కెనడా కఠిన ఆంక్షలను విధించాయి.

ఈ పరిణామాలతో దాదాపు యుద్ధం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకున్న విదేశాంగ మంత్రిత్వ శాఖ.. ఉక్రెయిన్‌లో నివసిస్తోన్న భారతీయులు, విద్యార్థుల తరలింపును చేపట్టింది. 20 వేల మందికి పైగా విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. వారిలో చాలామంది మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే వేల సంఖ్యలో భారతీయులు వేర్వేరు ఉద్యోగాలు, ఉపాధి పనుల్లో స్థిరపడ్డారు.

వారిని స్వదేశానికి తీసుకుని రావడానికి ఎయిరిండియా ఇదివరకే మూడు విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి విమానం మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి కీవ్‌కు బయలుదేరి వెళ్లింది. 242 మంది వైద్య విద్యార్థులతో తిరిగొచ్చిందీ ఫ్లైట్. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఇవ్వాళ కూడా ఓ ప్రత్యేక విమానం కీవ్‌కు బయలుదేరి వెళ్తుంది. రేపు, ఎల్లుండి మిరిన్ని విమానాలు ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకుంటాయి.

Air India flight carrying 242 passengers from Kyiv reaches Delhi, here what they said on Ukraine crisis

ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా వారు వివరించారు. ప్రస్తుతానికి అంతా ప్రశాంతంగానే ఉందని, ఎప్పుడేం జరుగుతుందో తెలియని వాతావరణం నెలకొని ఉందని ఎంబీబీఎస్ విద్యార్థి శివమ్ చౌధురి తెలిపారు. రెండు రోజుల్లో అక్కడి పరిస్థితులు పూర్తగా మారిపోయాయని, భారత ఎంబసీ అధికారులు కూడా తమ తరలింపు చర్యలను ముమ్మరం చేశారని పేర్కొన్నారు. మున్ముందు ఎలాంటి అక్కడి పరిస్థితులు సాధారణంగా ఉండకపోవచ్చనే సంకేతాలు ఉన్నాయని అన్నారు. స్వదేశానికి చేరుకోవడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు.

English summary
Air India special flight carrying around 242 passengers from Ukraine reaches Delhi. MBBS student Shivam Chaudhary said on Ukrain crisis that the situation is peaceful right now but the tension seems to be building up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X