ఎయిర్ ఇండియా విమానంలో మంటలు (వీడియో)
ఢిల్లీ: ఢిల్లీ-వారణాసి నగరాల మద్య సంచరించే విమానంలో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్యల కారణంగా మంటలు వ్యాపించాయని ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు.
ఢిల్లీ- వారణాసిల మధ్య ఎయిర్ ఇండియా విమానం నడుస్తుంది. సోమవారం ఎయిర్ ఇండియా విమానం ఏఐ-405 వారణాసి నుంచి ఢిల్లీ చేరుకుంది. అందులో 144 మంది ప్రయాణికులు ఉన్నారు. తరువాత ఢిల్లీలో విమానం టేకాఫ్ తీసుకుంది.

ఆ సందర్బంలో ఇంజన్ లో సాంకేతిక సమస్యలు తలెత్తి మంటలు వ్యాపించాయి. విషయం గుర్తించిన ఫైలెట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులతో పాటు ఎవ్వరికి ఎలాంటి హాని జరగలేదని, అందరు సురక్షితంగా ఉన్నారని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications